వాతావరణ తేమ వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో ప్రతి మూలలో బొద్దింకలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటాయి. ఇవి అటూ ఇటూ తిరగమే కాకుండా ఫుడ్ పైకి కూడా వెళుతుంటాయి. ఇలాంటి ఆహారాన్ని తింటే మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.
అయితే ఈ బొద్దింకలు మనల్ని చూడగానే ఏదో ఒక మూల, లేదా ఇతర చోట్ల దాక్కుంటుంటాయి. ఇవి ఎక్కువగా బాత్ రూం, టాయిలెట్, కిచెన్, కిచెన్ సింక్ లో తిరుగుతుంటాయి. కానీ వీటిని మాత్రం అంత సులువుగా బయటకు పోయేలా చేయలేం. చాలా మంది ఇంట్లో ఇవి లేకుండా చేయడానికి ఎంతో తిప్పలు పడుతుంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. కానీ వీటివల్ల ఇల్లు మొత్తం మురికిగా మారుతుంది. అలాగే రోగాలకు నియమవుతుంది. ఇవి వంటింట్లోకి వెళ్లి ఆహారాన్ని కలుషితం చేస్తాయి.
అందుకే ఆడవారు ఇంట్లో నుంచి బొద్దింకలను ఎలా వెల్లగొట్టాలని ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తుంటారు. అలాగే బొద్దింకల క్రిమిసంహారక మందును కూడా వాడుతుంటారు. అయితే మీకు ఒక చిన్న చిట్కా వీటిని లేకుండా చేసేందుకు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కా ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. కాబట్టి బొద్దింకలను సులువుగా వెళ్లగొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బొద్దింకలను పారదోలేందుక అవసరమైన పదార్థాలు
బోరిక్ ఆమ్లం
ఒక చెంచా గోధుమ పిండి
1/2 టీస్పూన్ చక్కెర
పాలు
బొద్దింకలు లేకుండా చేయడానికి ఈ పేస్ట్ ను ఎలా తయారు చేయాలి?
ముందు బోరిక్ ఆమ్లాన్ని కొనండి. ఇది మీకు ఏ మెడికల్ స్టోర్ లోనైనా సులువుగా దొరుకుతుంది. ఇకపోతే ముందుగా మూడు టీ స్పూన్ల బోరిక్ యాసిడ్ లో ఒక టీస్పూన్ గోధుమ పిండిని వేసి కలపండి. ఇప్పుడు దీనిలోనే అరటీస్పూన్ చక్కెరను వేసి బాగా కలగలపండి. ఆ తర్వాత పాలు పోసి చిక్కటి పేస్ట్ లా చేయండి. అంతే ఈజీగా బొద్దింకలు లేకుండా చేసే పేస్ట్ రెడీ అయిపోయింది.
ఈ పేస్ట్ ను ఎలా ఉపయోగించాలి?
బొద్దింకలు పారిపోయేలా చేసే ఈ పేస్ట్ ను తయారుచేసిన తర్వాత మీరు దీన్ని ఒక 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత అది గట్టిగా అయిపోతుంది. అలాగే మీరు ఉపయోగించడానికి కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట ను బొద్దింకలు ఎక్కువగా తిరిగే ఇంట్లోని ప్రతి ప్రదేశంలో అప్లై చేయండి. ముఖ్యంగా వంటగది క్యాబినెట్ లో, గ్యాస్ కింద, సింక్ చుట్టూ అప్లై చేయండి. ఈ పేస్ట్ బొద్దింకలకు చిరాకు కలిగిస్తుంది. ఈ పేస్ట్ ను వేళ్లతో గోడలకు రాయండి. ఈ ట్రిక్ తో మీ ఇంట్లో ఒక్క బొద్దింక లేకుండా పోతాయి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఈ ట్రిక్ ఒక్కటే కాకుండా.. మీ ఇంట్లోకి మళ్లీ బొద్దింకలు రావొద్దంటే మాత్రం మీరు మీ ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలి. అలాగే కిచెన్ రూం తడిగా ఉండకూడదు. ఎందుకంటే తడి ప్రదేశాల్లోనే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అలాగే బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట్ల బిర్యానీ ఆకులు, కర్పూరాన్ని ఉంచొచ్చు. ఇవి కూడా బొద్దింకలు లేకుండా చేస్తాయి. ఎందుకంటే వీటి వాసన బొద్దింకలకు నచ్చదు.