ఈ కాలంలో విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. దంపతుల మధ్య ఏవైనా చిన్న మనస్పర్థలు వచ్చినా... వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. సమస్యను పరిష్కరించాలనే దిశగా ఆలోచించడం లేదు. అయితే... తాజాగా... కొందరు పురుషులు.. తాము విడాకులు తీసుకోవడానికి గల కారణాలను తెలియజేశారు. మరి ఎక్కువ మంది పురుషులు విడాకులు తీసుకోవడానికి కారణాలేంటో సారి చూద్దాం...
1.మోసం...
కొందరు విడాకులు తీసుకోవడానికి చెప్పిన కారణం మోసం. తమ భార్య తమను మోసం చేసిందని అందుకే.. విడిపోయామని చెప్పడం గమనార్హం.
“నా భార్య నా కజిన్‌తో కలిసి నన్ను మోసం చేసింది. నా దగ్గర రుజువు కూడా ఉంది. ఇది నాకు చాలా బాధ కలిగించింది. ఆమె కోసం నేను చివరిదాకా ప్రయత్నించాను. కానీ.. ఆమె నన్నుమోసం చేసింది. అందుకే విడిపోయాం. విడాకులు రావడానికి సంవత్సరం పట్టింది.’’ అని ఓ వ్యక్తి చెప్పడం గమనార్హం.
2.మానసిక ప్రవర్తన..
భార్య మానసిక ప్రవర్తన కారణంగా ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడట.ప్రతి విషయంలోనూ తన భార్య తనను కంట్రోల్ చేయడం, ఆఫీస్ మీటింగ్ లో ఉన్నా కూడా ఫోన్లు చేయడం లాంటివి చేసేదట. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేందట. ఒక్కరోజు ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చే సరికి హాలు మధ్యలో కుర్చీ వేసుకొని.. మెడకు ఉరివేసుకొని కూర్చుందట. ఆమె టార్చర్ భరించలేక ఎనిమిది సంవత్సరాల బంధాన్ని విడాకులతో స్వస్తి చెప్పేశాడు.
3.మత విభేదాలు..
ఒక వ్యక్తి... వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. మొదట్లో అంతా బాగానే ఉండేదట. మెల్లిమెల్లిగా.. తన భార్య, ఆమె తల్లిదండ్రులు వీరిని కూడా మతం మారమని... తమకు నచ్చినట్లుగా చేయమని బలవంత పెట్టడం మొదలుపెట్టారట. దీంతో.... ఇద్దరి మధ్య విభేదాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో తాము విడిపోయామని చెప్పడం గమనార్హం.
4.మెంటల్ స్టెబులిటీ...
ఓ వ్యక్తి....తన భార్య మెంటల్ స్టెబిలిటీ తట్టుకోలేక విడాకులు ఇచ్చాడట. ప్రతి విషయానికి ఏడుస్తుందట. ఏది అడిగినా ఏడుస్తుందట. ఎందుకు అంటే సమాధానం చెప్పేది కాదట. తట్టుకోలేక విడాకులు ఇచ్చేశాడట. తర్వాత... ఆమె మానసిక ఆరోగ్యానికి చికిత్స తీసుకుందట.
Divorce
5.మద్యపానం...
తాను మద్యం మానేస్తే తప్ప...తనతో కలిసి ఉండనని తన భార్య తేల్చి చెప్పిందట. భార్యకన్నా మద్యమే ఎక్కువ అని భావించి... ఏకంగా భార్యకు విడాకులు ఇచ్చేశాడట.
6.సీక్రెట్స్ లేవు...
తన భార్య... ప్రతి విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పేదట. భర్తకు ఏదైనా ఇంక్రిమెంట్ వచ్చినా.. ఇలా ఏది జరిగినా వెంటనే తన తల్లిదండ్రులకు చెప్పేదట. దాని వల్ల.. డబ్బు మొత్తం వాళ్లకు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడేవట. తన దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలనిచ్చేది కాదట. తట్టుకోలేక.. విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు తన డబ్బులతో చక్కాగా... ఇల్లు కూడా కొనుక్కున్నాడు.