పండగపూట జాన్వీకపూర్ లా మెరిసిపోవాలంటే... ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే...

Published : Oct 27, 2021, 11:09 AM IST

గ్లామర్ లోనూ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటున్న జాన్వీ బాలీవుడ్ లో తన దైన గ్లామర్ షోతో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటోంది. పండగల వేళ జాన్వీ కపూర్ vintage vibeతో ఆకట్టుకుంటోంది. 

PREV
18
పండగపూట జాన్వీకపూర్ లా మెరిసిపోవాలంటే... ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే...

జాన్వీ కపూర్.. తనదైన నటనతో, గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటున్న వర్థమాన నటి. అతిలోక సుందరి, లేడీ సూపర్‌ స్టార్‌ శ్రీదేవి ముద్దుల కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన Janhvi Kapoor అనతి కాలంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. 

 

28

గ్లామర్ లోనూ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటున్న జాన్వీ బాలీవుడ్ లో తన దైన గ్లామర్ షోతో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటోంది. పండగల వేళ జాన్వీ కపూర్ vintage vibeతో ఆకట్టుకుంటోంది. 

38

festival makeupలో భాగంగా కళ్లకు 50ల నాటి స్టైల్లో  winged eyeliner తో అలంకరించుకుంటుంది. పెదవులు తాజాగా కనిపించడం కోసం గ్లాసీ లిప్స్ వేసుకుంటుంది. 

 

48

దీపావళి కాంతులు కళ్లలో ప్రతిఫలించేలా.. ఉండడానికి glittery eye shadow వేసుకుంటుంది. అసలే మెరిసే కళ్లు... ఈ గ్లిట్టర్ ఐ షాడోతో మరింత వన్నె తేరి మెరుపులు కురిపిస్తూ ఉంటాయి. 

58

kohl-rimmed eye makeup లేకపోతే మీ పండగ అలంకరణ పూర్తి కాదు. ఈ మేకప్ విషయంలో జాన్వీ కపూర్ చాలా పర్ ఫెక్ట్ గా ఉంటుంది. సో ఈ విషయంలో జాన్వీని ఫాలో అయితే మీ లుక్ అదిరిపోతుంది.

 

68

ఇక పండగల వేళ ప్రత్యేకంగా కనిపించాలంటే... మీరు చేయాల్సిందల్లా.. వింగ్ డ్ ఐలైనర్, గ్లిట్టర్ ఐ షాడో రెండింటినీ వేయడం వల్ల.. మీ లుక్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా మారిపోతుంది. పాత కాలంనాటి హీరోయిన్ లుక్ జాన్వీకి సరిగ్గా సరిపోతుంది. కనురెప్పలకు ఆమె చేసుకునే మేకప్ అద్బుతంగా పనికివస్తుంది.

78

గోతిక్, ఎడ్జీ లుక్ కోసం స్మోకీ ఐ మేకప్ కూడా ట్రై చేయచ్చు. ఇక మొత్తం మేకప్ అయిపోయాక మంచి highlighter  వాడడం వల్ల మీ ముఖం మరింతగా మెరిసిపోతుంది. ఏ పార్టీలో అయినా, పండగలో అయినా మీరే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. 

88

ఇక జాన్వీ పింక్ ఐ షాడో వేసిందంటే...అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇక మేకప్ విషయానికి వస్తే మరీ ముదురు రంగులు కాకుండా ఎంత తేలికగా మేకప్ వేసుకుంటే అంత బాగా లుక్ వస్తుంది. దీంతోపాటు పండగల వేళ మెరిసిపోవచ్చు అంటుంది జాన్వీ. 

Read more Photos on
click me!

Recommended Stories