ఆడవారైనా, మగవారైనా నల్లని, ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారు. జుట్టు వారి అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ ప్రస్తుతం చాలామంది జుట్టు రాలడం, తెల్లబడటం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది. అవెంటో చూసేయండి.
ఎవరైనా సరే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లకు జుట్టు పొడవుగా ఉండటం అంటే చాలా ఇష్టం. అది వారి అందాన్ని పెంచుతుంది. అయితే, చాలామందికి పొడవాటి, ఒత్తైన జుట్టు ఉండదు. జుట్టు రాలడం, తెగడం, తెల్లబడటం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అవెంటో చూసేయండి మరీ.
24
జుట్టు పొడవుగా పెరగడానికి
జుట్టు పెరగడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు. మార్కెట్ లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వస్తే అది ట్రై చేస్తూ ఉంటారు. అయితే అందులో ఉండే కెమికల్స్ కారణంగా అవి జుట్టు ఆరోగ్యానికి మంచి చేయకపోగా హాని చేయవచ్చు. వాటి వల్ల జుట్టు మరింత రాలవచ్చు. కాబట్టి జుట్టు కోసం సహజంగా దొరికే పదార్థాలను వాడటం మంచిది అంటున్నారు నిపుణులు. అవెంటో తెలుసుకుందాం.
34
జుట్టు పొడవుగా పెరగడానికి చిట్కాలు;
మెంతులు, కలబంద జెల్
- మెంతులు జుట్టు బాగా పెరగడానికి సహాయపడతాయి, పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తాయి.
- కలబంద జెల్ తలలో ఉండే అన్ని రకాల ఇన్ఫెక్షన్లను తొలగించడానికి సహాయపడుతుంది.
- జుట్టును తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.
- కలబంద జెల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
44
కలబంద, మెంతులు వాడే విధానం:
ముందుగా మెంతులను పేస్ట్ లాగా బాగా రుబ్బుకోవాలి. తర్వాత దాన్ని వడగట్టి 1-2 గంటలు అలాగే ఉంచండి. తర్వాత దాంట్లో కలబంద జెల్ కలపండి. కావాలంటే దీనికి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు అన్నీ బాగా కలిపి దాన్ని మీ తల పై నుంచి జుట్టు చివరి వరకు బాగా రాయాలి.
తర్వాత 15-20 నిమిషాలు అలాగే ఉంచి, లైట్ షాంపూతో స్నానం చేయాలి. కండీషనర్ కూడా వాడటం మర్చిపోకండి. ఈ పద్ధతిని మీరు వారానికి రెండుసార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.