Face Glow: ఈ పూలు ముఖానికి పెట్టినా.. స్కిన్ మెరిసిపోద్ది

Published : Feb 28, 2025, 03:25 PM IST

చర్మం అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు. అయితే.. దానికోసం ఏవేవో కాకుండా, పూలు వాడినా చాలు. ఇంట్లోనే మనం పూలతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...

PREV
15
Face Glow: ఈ పూలు ముఖానికి పెట్టినా.. స్కిన్ మెరిసిపోద్ది

అందంగా మెరిసిపోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అందుకోసం చాలా మంది చాలా రకాల ఫేస్ ప్యాక్ లను వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఉపయోగం ఉంటుందా అంటే ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. అయితే.. మీరు కేవలం పూలతో మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. పువ్వుల్లో మన చర్మాన్ని మెరిసేలా చాలా గుణాలు ఉన్నాయి. వీటిని బ్యూటీ సెలూన్లలో, బ్యూటీ ప్రొడక్ట్స్ లోనూ వాడతారు. ాకనీ.. మనం ఇంట్లోనే  తయారు చేసుకోవచ్చు. చర్మాన్ని అందంగా కూడా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

 

25

గులాబీ ఫేస్ ప్యాక్..

గులాబీ పూలు మనకు చాలా సులభంగా లభిస్తాయి. వీటితోనే మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. దీనిని ఫేస్ ప్యాక్ లా వాడటానికి గులాబీ రేకులు ఉంటే చాలు. తాజావి అయితే మరీ మేలు. గులాబీ రేకులను పేస్టులా చేసి దాంట్లో ఒక స్పూన్ పెరుగు, తేనె, నారింజ తొక్కల పొడి వేసి కలపాలి. దీనిని ముఖానికి రాసుకుంటే చాలు. పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కుంటే చాలు. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన చర్మం చాలా ఫ్రెష్ గా మారుతుంది.  చర్మానికి మంచి టోనింగ్ లా పనిచేస్తుంది.

 

35

బంతి ఫేస్ ప్యాక్..

బంతి పూలతో కూడా మనం అందంగా మెరిసిపోవచ్చని మీకు తెలుసా? మంచి సువాసనతో పాటు.. మన చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడంలోనూ ఈ పూలు కీలకంగా పని చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ కోసం మీరు...బంతి పువ్వుల్ని వేడి నీటిలో నానబెట్టి, పెరుగు, చందనం పొడి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయండి. ఇది మొటిమలు, దద్దుర్లు తగ్గిస్తుంది.

45

మందార ఫేస్ ప్యాక్

మందార ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరచడానికి, జిడ్డు తగ్గించడానికి, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. అచ్చంగా మందార పువ్వులను పేస్టుగా మార్చి, అందులో పెరుగు, తేనె కూడా కలిపి ముఖానికి రాసుకుంటే చాలు. ముఖం కాంతివంతంగా మారుతుంది.

55

మల్లె పూల ఫేస్ ప్యాక్..

మల్లెపూలతో కూడా మనం మన అందాన్ని పెంచుకోవచ్చు. తాజా మల్లెపూలను పేస్టులా చేసి.. దానిలో కలబంద గుజ్జు వేసి పేస్టులాగా చేయాలి. దీనిని ముఖానికి రాసుకుంటే చాలు. మీ అందం పెరుగుతుంది.  ఇది ముడతలు లేని చర్మాన్ని ఇస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

click me!

Recommended Stories