ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించి ఇడ్లీని తయారు చేయడం వల్ల క్యాన్సర్ కారకమవుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్లాస్టిక్ అధిక వేడికి గురైనప్పుడు హానికరమైన రసాయనాలు విడుదలవుతాయి. కొన్ని ప్లాస్టిక్‌లు డయాక్సిన్లు, మైక్రోప్లాస్టిక్‌లను కూడా విడుదల చేస్తాయి. ఇవి కాలక్రమేణా శరీరంలో పేరుకుపోతాయి, దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు లోనైతే, ప్లాస్టిక్ క్షీణించి విషపూరిత సమ్మేళనాలను విడుదల చేస్తుంది. చూశారుగా ఇకపై బయట ఇడ్లీ తింటుంటే ఓసారి జాగ్రత్తగా చూసి తినండి.
గమనిక: ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే కేవలం బయట ప్లాస్టిక్ షీట్లలను ఉపయోగించి తయారు చేసే ఇడ్లీలతోనే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఎంచక్కా ఇడ్లీలను తినొచ్చు.