కొంతమంది కళ్లు ఎప్పుడు చూసినా ఎర్రగానే ఉంటాయి. నిజానికి కళ్ల గురించి, వాటి ఆరోగ్యం గురించి పట్టించుకునే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. కళ్లు చాలా సున్నితమైనవి. వీటి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే.. మీ కంటిచూపు దెబ్బతినొచ్చు. మొత్తం కంటిచూపే పోవచ్చు. అందుకే కళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇకపోతే కళ్లు ఎర్రబారడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ అలిసిపోతే కూడా కళ్లు ఎర్రబడతాయి. ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లను ఎక్కువ వాడటం వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయి. తెల్లవార్లు నిద్రపోకున్నా ఇలాగే అవుతుంది. అలాగే బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కూడా కళ్లు ఎర్రగా మారతాయి. కానీ కళ్లు ఎర్రబడటం వల్ల కంటినొప్పి, చికాకు వంటి సమస్యలు వస్తాయి. అసలు కళ్లు ఎందుకు ఎర్రబడతాయి.. వాటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..