నీళ్లెన్ని తాగినా.. దాహం మాత్రం తీరట్లేదా? అయితే మీకు ఈ వ్యాధులున్నట్టే..! చెక్ చేసుకోండి..

First Published Oct 9, 2022, 10:33 AM IST

కొంతమంది అన్నం తినేటప్పుడే నీళ్లను తాగితే ఇంకొంతమంది దాహం వేసినప్పుడే తాగుతారు. మరికొంతమంది మాత్రం ఎప్పుడూ తాగుతూనే ఉంటారు. ఎందుకంటే వీళ్లకు ఎన్ని నీళ్లు తాగినా దాహం మాత్రం తీరదు. ఇలా ఎందుకు అవుతుందో తెలుసా..? 
 

మన శరీరానికి నీళ్లు అవసరం కాదు.. అత్యవసరం. ఎందుకంటే మన శరీరంలో ఎక్కువ భాగం నీళ్లే ఉంటాయి. నీళ్లతోనే మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఇక వేసవిలో అయితే నీళ్లను ఎక్కువగా తాగాలి. ఎందుకంటే ఎండలకు ఒంట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో పోతుంది. అయితే కొంతమంది కాలాలతో సంబంధం లేకుండా గంట గంటకు మోతాదుకంటే ఎక్కువ నీళ్లను తాగేస్తుంటారు. వీళ్లు ఎన్ని నీళ్లు తాగినా దాహం మాత్రం తీరదు. ఇలాంటి వాళ్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిని పాలిడిప్సియ అని అంటారు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్టైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. అలాగే బ్లడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోండి. అప్పుడే మీ దాహానికి కారణం ఏంటో తెలుసుంది. అయితే మితిమీరిన దాహం ఇతర అనారోగ్య సమస్యకు కూడా కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నిర్జలీకరణం

డీహైడ్రేషన్ అనేది వ్యాధి కాదు. కానీ దీనివల్ల పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కోసారి దీనివల్ల చనిపోవచ్చు కూడా. శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో వాంతులు,  మైకము, తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలో బలం కూడా ఉండదు. 
 

డయాబెటీస్

ఒక వ్యక్తి డయాబెటీస్ బారిన పడ్డా.. అతను ఆ విషయాన్ని అంత సులువుగా గుర్తించలేడు. అయితే ఈ సమస్య వల్ల దాహం అతిగా వేస్తుంది. ఇది కూడా డయాబెటీస్ కు సంకేతమే అంటున్నారు నిపుణులు. డయాబెటీస్ వల్ల మన శరీరం ద్రవాలను సరిగ్గా నియంత్రించలేకపోవడం వల్ల ఇలా జరుగుతుందట. మీకు తరచుగా దాహం వేస్తుంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలను టెస్ట్ చేసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. 

నోరు పొడిబారడం

మనకు నీళ్లు తాగాలనిపించినప్పుడు కూడా నోరు పోడిబారుతుందట. అయితే నోటి గ్రంధులు లాలాజాలన్ని సరిగ్గా తయారు చేయలేనప్పుడు కూడా నోరు ఎండిపోతుంది. దీనివల్ల చిగుళ్ల సంక్రమణ, నోటి నుంచి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి. 
 

రక్తహీనత

మన శరీరంలో ఎర్ర రక్తకణాలు లోపించడం వల్ల మన శరీరంలో రక్తం స్థాయిలు తగ్గుతాయి. దీనినే రక్తహీనత అంటారు. సాధారణ భాషలో రక్తం లేకపవడం అంటారు. ఈ సమస్య వల్ల కూడా దాహం ఎక్కువగా అవుతుంది. దీంతో నీళ్లను మోతాదుకు మించి తాగేస్తుంటారు. 
 

click me!