బరువు తగ్గడానికి నిజంగా నిద్ర సహాయపడుతుందా..?

First Published Oct 8, 2022, 4:56 PM IST

తక్కువ గంటలు పడుకోవడం వల్ల అతిగా తింటారు. దీనివల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునే వారికి సరైన నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. 
 

బరువు పెరగడానికి నిద్రకు దగ్గరి సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొనే వారికి ఆకలి బాగా అవుతుంది. దీంతో ఏది ఉంటే అది తినేస్తుంటారు. దీనివల్ల విపరీతంగా బరువు పెరగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  తక్కువ నిద్ర గంటలు కేవలం  బరువు పెంచడం లేదా ఊబకాయం బారిన పడేయడమే కాదు.. జీవక్రియ రుగ్మతలను కూడా కలిగిస్తుందట.
 

శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర కూడా పోషకాహారానికి సంబంధించినదేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే నిద్రలేమి వల్ల జీవక్రియ రుగ్మతలు, బరువు పెరగడం, ఊబకాయం పెరగడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. పేలవమైన నిద్ర, నాణ్యతలేని నిద్ర కు బరువు పెరగానికి ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

 మీరు 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే బరువు తగ్గడమనేది కలగానే మిగిలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మనం శ్వాసించేటప్పుడు, చెమట పట్టినప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అదే మీరు సరిగ్గా నిద్రసరిగా పోకపోతే కేలరీలను ఎక్కువగా తీసుకుంటారు. ఒక అధ్యయనం ప్రకారం.. జస్ట్ నాలుగు గంటలే నిద్రపోయే వ్యక్తులలో బెల్లీ ఫ్యాట్ లో పెరుగుదల దాదాపు 10% గా ఉంటుందట. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

రాత్రుళ్లు ఎక్కువ సేపు నిద్రపోని వ్యక్తులు కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్నే తింటారని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇలాంటి వారు అతిగా తింటారు. ఇది వారి శరీర బరువును పెంచుతుంది. అందులోనూ కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అలసట కలుగుతుంది. శరీరం బద్దకంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

అంతేకాదు ఏకాగ్రత లోపిస్తుంది. మీ రోజు వారి పనులను చేయడానికి కూడా ఒంట్లో శక్తి ఉండదు. అలాగే సరిగ్గా వ్యాయామం చేయడానికి కూడా రాదు. ఇది పరోక్షంగా మీరు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి నిద్ర ఆరోగ్యకరమైన శరీర బరువుకు సంబంధించినది నిపుణులు చెబుతున్నారు. 

మన ఆకలిని న్యూరోకెమికల్స్,  గ్రెలిన్,  లెప్టిన్ ద్వారా నియంత్రిస్తారు. నిద్రలేమి గ్రెలిన్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీంతో ఆకలి కోరికలు పెరగుతాయి. ఇంకేముంది దీంతో మీరు ఊబకాయం బారిన పడతారు. లెప్టిన్ అనే హార్మోన్ మన ఆకలిని అదుపులో ఉంచుతుంది . అతిగా తినకుండా చేస్తుంది.

రాత్రిళ్లు మీరు ప్రశాంతంగా ఉండేందుకు, హాయిగా పడుకోవడానికి కొన్ని రకాల ఆహారాలు మీకు సహాయపడతాయి. అవే.. అల్లం టీ, గింజలు, చామంతి టీ. ఇకపోతే నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు మీ భోజనాన్ని కంప్లీట్ చేయండి. రాత్రివేళ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కెఫిన్ ను జోలికి వెల్లకండి. డ్రై ఫ్రూట్స్, అల్లం, తులసి టీ, దాల్చిన చెక్క నీరు, చామంతి టీ వంటివి రాత్రి వేళ తీసుకోండి. ఇవి మీరు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడతాయి. 

click me!