Homemade Ghee: మన వంటకాల్లో నెయ్యికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. గట్టి పప్పులో ఒక స్పూను నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. నెయ్యి చేయాలంటే పాల మీగడ లేదా వెన్న ఉండాలని అనుకుంటారు. మీగడ లేకపోయినా గట్టి పెరుగుతో కూడా స్వచ్ఛమైన నెయ్యిని తయారుచేయొచ్చు.
మన వంటల్లో నెయ్యి ఎంతో ముఖ్యమైనది. అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది వంటలకు రుచినివ్వడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లో దొరికే నెయ్యి కల్తీ జరిగే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే నెయ్యిని తయారుచేసుకోవచ్చు. దీనికోసం పెరుగు ఉంటే సరిపోతుంది.
నెయ్యి చేయాలంటే రోజూ పాలు కాచిన తరువాత పైన వచ్చిన మీగడను తీసి ఒక గిన్నెలో వేసి స్టోర్ చేస్తాం. అది ఎక్కువ అయ్యాక దానితో నెయ్యిని తయారుచేస్తాము. కానీ మీగడ లేకపోయినా… పెరుగుతో సులువుగా నెయ్యి చేయవచ్చు.
23
పెరుగుతో నెయ్యి ఇలా...
మీగడ లేకపోయినా పెరుగుతోనే నెయ్యి ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. దీని కోసం రెండు నుంచి మూడు లీటర్ల ఫుల్ క్రీమ్ పాలు, 2-3 చెంచాల పెరుగు, చల్లటి నీళ్లు, అడుగు మందంగా ఉన్న గిన్నె, హ్యాండ్ బ్లెండర్ లేదా మిక్సీ అవసరం. ముందుగా ఫుల్ క్రీమ్ పాలను మరిగించాలి. పాలు గోరువెచ్చగా అయ్యాక మూడు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. గిన్నెపై మూతపెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచాలి.
33
ఇలా చేయండి నెయ్యి
పెరుగు గట్టిగా మారాక ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేయాలి. కొద్దిగా చల్లటి నీళ్లు పోసి కొన్ని సెకన్ల పాటు మిక్సీ పట్టండి. కొద్దిసేపటికే వెన్న పైకి తేలుతుంది. వెన్నను తీసి వేరుగా ఒక గిన్నెలోకి పెట్టండి. ఇలా మొత్తం పెరుగును చేయాలి. వెన్న ఎక్కువగానే వస్తుంది. ఈ వెన్నను చల్లటి నీటిలో సార్లు వేసి మళ్లీ తీయాలి. దీనివల్ల పెరుగు పులుపు పోయి, నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఈ వెన్నను వేయండి. తక్కువ మంట మీద నెమ్మదిగా మరిగించండి. బంగారు రంగులో నెయ్యి వచ్చేదాకా మరిగించండి. మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆపేయండి. నెయ్యిని వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోండి. అంతే టేస్టీ నెయ్యి రెడీ అయినట్టే.