అణు విస్ఫోటనం (Nuclear bomb) అంటే ఎంతో ప్రమాదకరమైన విధ్వంసం. అలాంటి విధ్వంసం నుంచి కూడా బతికి బట్టకట్ట గల జీవి ఒక్కటే ఒక్కటుంది. అదే బొద్దింక. అది మన ఇంట్లోనే ఉంటుంది. కానీ ఇంటి మీద అణుబాంబు పడినా దానికి మాత్రం ఏమీ కాదు.
అణు బాంబు పేలుడు వల్ల కలిగే విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అది ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకి నగరాలను గుర్తుతెచ్చుకుంటే సరిపోతుంది. అణు బాంబు పేలిన తర్వాత ఆ ప్రదేశంలో మొక్క మొలవడానికి కూడా కొన్నేళ్ల సమయం పడుతుంది. కానీ ఒక జీవి మాత్రం అణు విస్ఫోటనం నుంచి ఆరోగ్యంగా బయటికి వస్తుంది. దాన్ని అణు బాంబు కూడా ఏది చేయలేదు.
25
బిందాస్ బొద్దింక
అణు దాడిలో ఏదైనా నాశనం కావాల్సిందే. అణు విస్ఫోటనానికి ప్రతి జీవి ప్రభావితం అవుతుంది. కానీ మీ ఇంట్లో కనిపించే బొద్దింక మాత్రం చాలా బిందాస్ గా బతికేస్తుంది. అణు దాడి ఒక నగరాన్ని నాశనం చేయగలరు. కానీ బొద్దింకకు మాత్రం ఏమీ చేయలేదు.
35
శరీరం మీద బొబ్బర్లు
అణు బాంబు పేలిన తర్వాత అధిక స్థాయిలో రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. ఆ రేడియేషన్ ను తట్టుకునే శక్తి అందరికీ ఉండదు. మనుషులు, జంతువులు, మొక్కలు అన్నీ ఆవిరి అయిపోవాల్సిందే. శరీరం మీద వేడి బొబ్బర్లతో కాలిపోవాల్సిందే. కానీ బొద్దింకలకు మాత్రం ఏమీ జరగదు.
అణు విస్పోటనం వల్ల వచ్చే విత్తనాల వల్ల బొద్దింకలు ఏమాత్రం ప్రభావం కావు. అవి పదివేల రాడ్‌ల వరకు రేడియేషన్ ను తట్టుకుంటావు. అదే మనుషులైతే 800 రాడ్ ల రేడియేషన్‌కు గురి అయితే చాలు మరణిస్తారు. అంటే మనిషి కంటే బొద్దింక అణు విస్పోటనాన్ని ఎంతగా తట్టుకోగలదో ఆలోచించండి.
55
రెండు నగరాలు నాశనమైనా..
రెండవ ప్రపంచ యుద్ధంలో అణు బాంబు వల్ల పూర్తిగా రెండు నగరాలు నాశనమైపోయాయి. ఆ నగరంలో ఒక్క జీవి కూడా బతికి లేదు.. కానీ బొద్దింకలు మాత్రం బిరబిరా పాక్కుంటూ బయటికి వచ్చాయి. అంత వినాశననమైన అణు దాడి నుంచి కూడా బొద్దింకలు బయట పడ్డాయంటే వాటికున్న ప్రత్యేక శక్తి ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. అప్పుడే వాటికి ఉన్న రేడియేషన్ ను తట్టుకోగల పవర్ గురించి తెలిసింది.