Women Health: మహిళలు సాధారణంగా ఆరోగ్యం విషయంలో స్ట్రాంగ్ గా ఉంటారు. కాని 50 ఏళ్లు దాటిన తర్వాత కాస్త వీక్ అవుతారు. అందువల్ల 50 ఏళ్లు వయసు దాటిన స్త్రీలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో చాలా సాధారణమైనది బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడే ముఖ్యమైన పరీక్ష మెమ్మోగ్రామ్. 50 ఏళ్లు దాటిన స్త్రీలు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర ఉంటే వైద్యుల సలహా మేరకు ఈ పరీక్షను తరచుగా చేయించుకోవడం మంచిది.
27
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్ష
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించడానికి పాప్ స్మియర్, HPV పరీక్షలు సహాయపడతాయి. 65 ఏళ్లు వచ్చే వరకు పాప్ స్మియర్ పరీక్ష చేయించుకుంటూ ఉండటం మంచిది. ఈ క్యాన్సర్ ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే తరచూ ఈ పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. వరుసగా ఈ టెస్ట్ నెగెటివ్ వస్తే వైద్యులే ఈ టెస్ట్ ఆపేస్తారు. అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. HPV పరీక్షను పాప్ స్మియర్‌తో కూడా కలిపి చేయవచ్చు.
37
ఎముకల సాంద్రత పరీక్ష
మెనోపాజ్ తర్వాత స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్లు తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎముకల సాంద్రతను కొలవడానికి DEXA స్కాన్ ఉపయోగపడుతుంది. ఎముక బలహీనతను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించవచ్చు. సాధారణంగా 65 ఏళ్లు పైబడిన స్త్రీలకు ఈ పరీక్ష చేస్తారు. కానీ లక్షణాలు ముందుగానే కనిపిస్తే 50 ఏళ్ల వయసులోనే చేయించుకోవడం మంచిది.
50 ఏళ్లు పైబడిన స్త్రీలకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొలనోస్కోపీ లేదా సిగ్మోయిడోస్కోపీ వంటి పరీక్షల ద్వారా పేగులోని కణితులు, ఇతర అసాధారణ పెరుగుదలలను గుర్తించవచ్చు. సాధారణంగా పది సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది.
57
కంటి పరీక్ష
వృద్ధ మహిళలకు కంటిశుక్లం(Cataract), కంటిచూపు నష్టం(Glaucoma), వయస్సు సంబంధిత మాక్యులార్ క్షీణత(AMD) వంటి కంటి వ్యాధులు రావచ్చు. సంవత్సరానికి ఒకసారి పూర్తి కంటి పరీక్ష చేయించుకోవడం అవసరం.
67
చర్మ క్యాన్సర్, ఇతర పరీక్షలు
శరీరంపై అసాధారణమైన మచ్చలు, పుట్టుమచ్చలు చర్మ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవడం అవసరం. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దంత పరీక్ష, షుగర్, బిపి, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి సాధారణ పరీక్షలు చేయించుకోవాలి.
77
వైద్య సలహా అవసరం
పైన పేర్కొన్న సమాచారం అంతా ఇంటర్నెట్‌లో లభించిన సాధారణ సమాచారం మాత్రమే. మీ వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ చరిత్ర, రిస్క్ ల ఆధారంగా ఏ పరీక్షలు అవసరం, ఎప్పుడు చేయించుకోవాలి అనేది మీ వైద్యుడిని సంప్రదించి నిర్ణయించుకోవాలి. అదనపు సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం అవసరం.