Childrens Eye Health: మీ పిల్లల కళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు తప్పనిసరిగా పాటించండి

Published : Jul 06, 2025, 07:08 PM IST

Childrens Eye Health: పిల్లలకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. కంటి ఆరోగ్యం కూడా అంతే అవసరం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఐదు సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
పిల్లలకు ఈ ఆహారం పెట్టండి

పిల్లల కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ ఎ, సి, ఇ, జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, నారింజ, బ్రోకలీ, గుడ్డు, బాదం, చియా గింజలు, చేపలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది వారి దృష్టిని మెరుగుపరచడమే కాకుండా, వృద్ధాప్యంలో వచ్చే కంటి సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది.

25
ఇలాంటి కంటి ఎక్సర్‌సైజ్‌లు చేయించండి

పిల్లలకు మొబైల్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్, టీవీ వంటివి గంటల తరబడి చూడటాన్ని తగ్గించాలి. అధిక స్క్రీన్ సమయం కంటి అలసట, పొడి కళ్ళు, షార్ట్ సైట్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. స్క్రీన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఇది కళ్ళకు విశ్రాంతినిచ్చి కంటి అలసటను తగ్గిస్తుంది.

35
ఆడుకోవడాన్ని ప్రోత్సహించండి

పిల్లలను ఇంట్లోనే ఉంచడం వల్ల వారి వాళ్లు ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతారు. కాబట్టి వారిని బయట ఆడుకోవడానికి వెళ్లేలా ప్రోత్సహించండి. సహజ సూర్యకాంతి, వెలుతురును చూడటం వల్ల కంటి కండరాల ఒత్తిడి తగ్గి, షార్ట్ సైట్ రాకుండా నివారిస్తుంది. 

వారానికి 10 నుండి 14 గంటల పాటు పిల్లలను బయట ఆడుకోనివ్వాలి. ఇది విటమిన్ డి ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. చేతిలో ఫోన్ ఇచ్చి ఒకే చోట కూర్చోబెట్టకుండా సాయంత్రం వేళల్లో పార్కులు, ఆట స్థలాలు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లి ఆడుకోనివ్వండి.

45
ప్రొటెక్షన్ కళ్లద్దాలు ఉపయోగించేలా చూడండి

తక్కువ వెలుతురు కళ్ళపై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే పిల్లలు చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. పదునైన వస్తువులను ఉపయోగిస్తున్నప్పుడు కళ్ళకు రక్షణ కళ్ళద్దాలు ధరించేలా చూసుకోండి. 

ద్విచక్ర వాహనాలపై పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు దుమ్ము వల్ల కళ్ళు దెబ్బతినకుండా ఉండటానికి కళ్ళద్దాలు ధరించేలా చూడండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం అలవాటు చేయండి.

55
రెగ్యులర్ గా కంటి పరీక్షలు చేయించండి

పిల్లల కంటి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. పాఠశాలకు వెళ్లే ముందు, ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. 

కంటి చూపు లోపాలు లేదా ఇతర కంటి వ్యాధులు ఉన్నాయా అని కచ్చితంగా గుర్తించి, అవసరమైన చికిత్స అందించగేది కంటి వైద్యుడు మాత్రమే. ప్రారంభ దశలోనే కంటి సమస్యలను గుర్తించి చికిత్స చేయడం వల్ల దీర్ఘకాలిక దృష్టి లోపాలను నివారించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories