Emotional Eating: ఎమోషనల్ ఈటింగ్ బారిన పడ్డారా? దీని నుంచి ఇలా బయటపడండి..

Published : Feb 03, 2022, 10:46 AM IST

Emotional Eating: ప్రస్తుతం చాలా మంది ఎమోషనల్ ఈటింగ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇంతకీ ఎమోషన్ ఈటింగ్ అంటే ఏంటో తెలుసా..? దీని బారిన పడితే ఎంతలా తింటారో తెలిస్తే షాక్ అవుతారు.. 

PREV
14
Emotional Eating: ఎమోషనల్ ఈటింగ్ బారిన పడ్డారా? దీని నుంచి ఇలా బయటపడండి..


Emotional Eating: చాలా మంది ఆనందంగా ఉన్నప్పుడే ఏదైనా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ కొంతమంది మాత్రం బాధగా ఉన్నప్పుడు, భావోద్వేగానికి గురైనప్పడు లేదా నెగిటీవ్ ఎమోషన్స్ చుట్టుముట్టినప్పుడు ఇంట్లో ఏదున్నా సరే వెతుక్కుని మరీ తినేస్తుంటారు. ఈ ఆహారపు అలవాటు అప్పటికప్పుడు వచ్చినదే. దీన్నే ఎమోషనల్ ఈటింగ్ అంటారు. ఈ సమస్య బారిన పడిన వాళ్ల మనసు బాగాలేనప్పుడు వారి మైండ్ ఆటోమెటిక్ గా ఫుడ్ మీదికి మళ్లుతుంది. అలా వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను తినడం వల్ల వారు నెగిటీవ్ థాట్స్ నుంచి, బాధ నుంచి బయటపడగలుగుతారు. అంతేకాదు వారు  తాత్కాలిక సంతృప్తిని కూడా పొందుతారు. కానీ ఆ సమయంలో వారు ఎంతలా తింటారో వారికే తెలియదు.  
 

24

ఫిజికల్ హంగర్, ఎమోషనల్ హంగర్ కు ఉన్న తేడా:

ఫిజికల్ హంగర్ సహజంగా కలిగేది. ఇది మనకు సాధారణంగా కలిగే ఆకలి. ఈ ఆకలి వేసినప్పుడు మనకు తెలుస్తుంది. అదే ఎమోషనల్ హంగర్ అలా కాదు. ఇది Sudden గా కలుగే ఫీలింగ్. అంటే ఉన్నట్టుండి ఆకలిగా అనిపిస్తుందన్నమాట. ఫిజికల్ గా హంగర్స్ కు ఆకలి అయితే ఏ ఆహారం తీసుకున్నా కడుపు నిండుతుంది. కొంత ఆహారం తీసుకున్న తర్వాత ఇక చాలు అనే స్థితికి చేరుకుంటారు. అదే ఎమోషనల్ హంగర్స్ కు తమకు ఇష్టమైన ఆహారం తీసుకోవడం ద్వారానే ఆకలి తీరినట్టుగా ఉంటుంది. లేదంటే వారు అలాగే తింటూనే ఉంటారు. అంతేకాదు వీరికి ఎంత ఆహారం తీసుకున్నా.. సంతృప్తి చెందకపోగా.. ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటారు. వీరికి ఎంత తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ రాదు. ముఖ్యంగా ఈ ఎమోషనల్ ఈటింగ్ తో బాధపడేవారికి తమ తిండి పట్ల నెగిటీవ్ ఆలోచనలు కూడా ఉంటాయి.

34

కారణాలు, నివారణా చిట్కాలు..

తరచుగా ఒత్తిడికి, భావోద్వేగానికి గురైనా.. ఎమోషనల్ ఈటింగ్ బారిన పడే అవకాశముంది. అందుకే ఒత్తిడి కలిగిప్పుడు ధ్యానం, యోగా, మ్యూజిక్ థెరపీ, ఆర్మోథెరపీ వంటివి క్రమం తప్పకుండా పాటిస్తే దీని బారిన పడకుండా ఉంటారు. అంతేకాదు  తరచుగా మీకు ఎందుకు ఆకలిగా అనిపిస్తుందో తెలుసుకోండి. మీకు నిజంగానే ఆకలి అవుతుందా? లేకపోతే ఎమోషనల్ గా ఉన్నప్పుడే మీ మనసు ఫుడ్ పైకి మళ్లుతుందా అనే అవిషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మీరు ఎమోషనల్ ఈటింగ్ లోనే ఎక్కువగా తింటున్నానని భావిస్తే.. మీ రోజు ఆహారంలో పోషకవిలువలున్న ఆహార పదార్థాలే ఉండేలా చూసుకోండి. దీని వల్ల మీరు బరువు పెరిగే ఛాన్సెస్ ఉండదు. 

44


ఈ ఎమోషనల్ ఈటింగ్ సమస్యను తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఎమోషనల్ ఈటింగ్  బారిన పడితే ఆ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. దాన్ని ఏయే మార్గాల ద్వారా అధిగమించవచ్చో వాటిని పాటించండి. లేదంటే ఇది ఎన్నో సమస్యలకు దారి తీసే ప్రమాదముంది.    

Read more Photos on
click me!

Recommended Stories