Summer Tips: ఎండాకాలంలో చెమట లేకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి?
ఎండాకాలంలో చెమట ఎక్కువ పోస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్. కానీ.. మనం కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల.. ఆ చెమట దుర్వాసనను తగ్గించుకోవచ్చు. ఎక్కువ కాలం ఫ్రెష్ గా కూడా ఉండొచ్చు.
ఎండాకాలంలో చెమట ఎక్కువ పోస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్. కానీ.. మనం కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల.. ఆ చెమట దుర్వాసనను తగ్గించుకోవచ్చు. ఎక్కువ కాలం ఫ్రెష్ గా కూడా ఉండొచ్చు.
ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పోస్తూ ఉంటాయి. ఆ చెమట కారణంగా వచ్చే దుర్వాసన, ఫంగస్, చర్మ సమస్యలు, అసౌకర్యం కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తాయి, అయితే.. ఇంట్లో సహజంగా ఉపయోగించే కొన్ని చిట్కాలతో అధిక చెమట సమస్య నుంచి బయటపడొచ్చు.
వేప నీటితో రక్షణ:
వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. చెమట ఎక్కువగా వచ్చే భాగాల్లో వేప నీటిని రాస్తే బాక్టీరియా పెరగకుండా అడ్డుకోవచ్చు. ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో శరీరాన్ని తుడవడం వల్ల చర్మం శుభ్రంగా, తేలికగా ఉంటుంది.
యాంటీ బాక్టీరియల్ సబ్బు వాడటం:
ప్రతి రోజు వేడి నీటితో స్నానం చేసి యాంటీ బాక్టీరియల్ సబ్బులు వాడితే శరీరంపై దుర్వాసన సృష్టించే బ్యాక్టీరియా నిర్మూలించవచ్చు. చెమట వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం:
వేసవిలో చల్లటి నీటితో లేదా ఐస్ మిక్స్ చేసిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వేడిని తగ్గించుకోవచ్చు. దాంతో పాటు మానసికంగా కూడా శాంతి లభిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచడంలో కాటన్, లైట్ కలర్ దుస్తులు ఎంతో సహాయపడతాయి. ఒకే దుస్తులను రెండుసార్లు వాడకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. లోదుస్తులు తరచూ మార్చుకోవడం, వాటిని సూర్యరశ్మిలో ఎండబెట్టడం అవసరం.
నీరు తాగడం..
రోజువారీ జీవితంలో నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వేడి, సోడియం మోతాదులు సంతులనంగా ఉంటాయి. ఇది చెమటను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అదే విధంగా, ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని చల్లపరుస్తుంది.
ఈ చిన్నచిన్న అలవాట్లతో వేసవిలో చల్లదనాన్ని పొందవచ్చు. చెమట వల్ల వచ్చే దుర్వాసనను నివారించడంలో సహజ చిట్కాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.