కూర్చొని కూర్చొని పొట్ట పెరిగిపోయిందా..? ఇదిగో ఈ చిట్కాలతో సులువుగా తగ్గించుకోండి..

First Published Oct 6, 2022, 3:01 PM IST

గంటలకు గంటలు కుర్చీలో కూర్చోవడం వల్ల పొట్టచుట్టూ కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకేముందు మీ పొట్ట సైజు కూడా బాగా పెరిగిపోతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే సులువుగా పొట్టను కరిగించొచ్చు. అవేంటంటే.. 
 

కూర్చొని చేసే పనులు అంతకష్టంగా అనిపించనప్పటికీ.. ఇలా పనిచేయడం వల్ల సర్వరోగాలు చుట్టుకునే ప్రమాదం పెరుగుతుంది. అందులోనూ వీళ్లు వ్యాయామం చేయకపోవడం, లేట్ గా తినడం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్స్ ను ఎక్కువగా తింటే ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. వీటికి తోడు శరీర బరువు కూడా  విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా నడుము సైజు పెరుగుతుంది. పొట్ట, తొడల సైజు  కూడా పెరుగుతాయి. ఇది అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీ అందం తగ్గడమే కాదు.. మీలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే శరీర బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ మరువకుండా వ్యాయామం చేయాలి. పొట్ట సైజును తగ్గించే వ్యాయామాలు, పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

green tea

గ్రీన్ టీ

గ్రీన్ టీ కూడా బరువు తగ్గేందుకు సహాయడుతుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. గ్రీన్ టీ తాగడం వల్ల ఫుడ్ త్వరగా అరుగుతుంది. ఈ గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు రెండు మూడు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 
 

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ కూడా జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ పరిగడుపున ఆపిల్ సైడర్ వెనిగర్ ను తాగితే మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇందుకోసం గ్లాస్ నీటిని తీసుకుని అందులో రెండు లేదా మూడు టీస్పూన్ల ఆపిల్  సైడర్ వెనిగర్ ను కలిపి తాగాలి. ఇది మీ పేగులను శుభ్రం చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను కూడా తగ్గిస్తుంది. 
 

Tadasana

తడసనా 

తడసనా యోగా భంగిమ కూడా బెల్లీఫ్యాట్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఈ భంగిమ వల్ల నాడీమండలం బలోపేతం అవుతుంది. పిక్కలు, కాలి మడమలు కూడా బలంగా తయారవుతాయి. 
 

పర్వతాసనం

ఈ పర్వతాసనం చేయడం చాలా సులువు. ఈ ఆసనం కూడా పొట్ట తగ్గేందుకు ఎంతో సహాయపడుతుంది. ఈ ఆసనం వల్ల నడుము సైజు తగ్గడంతో పాటుగా ఏకాగ్రత పెరుగుతుంది. మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. 

పవన్ముక్తాసనం

ఈ ఆసనం వల్ల పొట్టకరగడంతో పాటుగా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా ఉపశమం పొందుతారు. ఈ ఆసనం పొట్టకు సంబంధించిన సమస్యలను పోగొడుతుంది. ఊబకాయం నుంచి కూడా బయటపడతారు. కడుపు ఉబ్బరంతో  బాధపడేవారికి ఇది బెస్ట్ మెడిసిన్ లాంటిదనే చెప్పాలి. ఈ ఆసనం ఉదరకోశ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. 
 

click me!