అర్ధరాత్రి సమయంలో బాగా ఆకలి వేస్తోందా... అయితే ఈ పదార్థాలను తినండి?

First Published Oct 6, 2022, 1:21 PM IST

సాధారణంగా కొన్నిసార్లు రాత్రి పడుకునే ముందు మనం భోజనం చేయకుండా పడుకుంటాము అయితే ఇలా ఖాళీ కడుపుతో పడుకోవడం వల్ల సరిగా నిద్ర పట్టదు అలాగే ఏ అర్ధరాత్రి సమయంలోన బాగా ఆకలి వేస్తుంది.
 

ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో ఆకలి వేయడంతో ఏం తినాలని, ఏం తింటే మంచిది అని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే అర్ధరాత్రి ఆకలి వేసినప్పుడు ఈ పదార్థాలను ఏమాత్రం ఆలోచించకుండా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు.
 

అర్ధరాత్రి సమయంలో బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏది ఉంటే దానిని తినడం వల్ల కొన్నిసార్లు జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే తొందరగా కడుపు నిండిన భావన కలిగే పదార్థాలను అలాగే త్వరగా ఆహారం జీర్ణం అయ్యే పదార్థాలను తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తవు. మరి అర్థరాత్రి సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది అనే విషయానికి వస్తే..
 

అర్ధరాత్రి బాగా ఆకలి వేసినప్పుడు మన ఇంట్లో తయారు చేసుకున్న పాప్ కార్న్ తినడం ఎంతో మంచిది. ఇలా పాప్ కార్న్ తినడం వల్ల మన శరీరంలోకి తక్కువ కేలరీలు కార్బోహైడ్రేట్లు అందడం వల్ల ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే పూల్ మకాన్(తామర గింజలు) కూడా తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో కూడా ఏ విధమైనటువంటి కేలరీలు కొవ్వు ఉండదు చాలా తక్కువ స్థాయిలో కొవ్వు ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది.
 

అర్ధరాత్రి బాగా ఆకలి వేసినప్పుడు ఓట్స్ తినడం కూడా ఎంతో మంచిది ఓట్స్ లో తక్కువ పరిమాణంలో కొవ్వు కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని నిరభ్యంతరంగా అర్ధరాత్రి అయినా కూడా తినవచ్చు అయితే ఇందులో కొద్దిగా పాలు అరటిపండు కలుపుకొని తిన్నా కూడా వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. మన ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉండే మరమరాలు అర్ధరాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు తినడం మంచిదే. ఇందులో కూడా తక్కువ కేలరీలు ఉంటాయి అలాగే ఎలాంటి కొవ్వు శాతం ఉండదు.
 

ఇక మన ఇంట్లో వేయించిన పల్లీలు ఉంటే వాటిని తినడం కూడా ఎంతో మంచిది ఇందులో మన శరీరానికి మంచి కలిగించే కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి వీటిని తిన్నా కూడా మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది.ఇక మన ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ పౌడర్ కనుక ఉంటే దానిని పాలలో కలుపుకొని తాగటం ఎంతో మంచిది. ఇలా ఇంట్లో తయారు చేసిన చాక్లెట్ పౌడర్ వల్ల కేలరీలను తగ్గించుకోవచ్చు.
 

అర్ధరాత్రి బాగా ఆకలి వేసినప్పుడు జొన్నలు లేదా సజ్జలతో చేసిన రొట్టెలపై బట్టర్ వేసుకొని తినడం కూడా మంచిది. ఇక ఇంట్లో ఎలాంటి ఆహార పదార్థాలు లేకపోతే పెరుగులో ఫ్రూట్స్ కలుపుకొని తినవచ్చు.పెరుగులో ఉండే క్యాల్షియం ప్రోటీన్స్ వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలిగి ఆకలిని తగ్గిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవు.

click me!