Kitchen Hacks: పచ్చడి జాడీల జిడ్డు, వాసన పోగొట్టాలా? ఇదొక్కటి చేస్తే చాలు

Published : Feb 03, 2026, 12:31 PM IST

Kitchen Hacks: పచ్చడి జాడీలను ఎంత శుభ్రం చేసినా జిడ్డు తొందరగా వదలదు. అంతేకాదు.. వాసన కూడా తొందరగా పోదు. వాటిని ఈ కింది ట్రిక్స్ వాడి శుభ్రం చేస్తే ఆ జిడ్డు తొందరగా వదులుతుంది.  

PREV
13
పచ్చడి జాడీలు..

భారతీయులు రెగ్యులర్ గా ఇంట్లో నిల్వ పచ్చళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ పచ్చళ్ల రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ పచ్చళ్లను నిల్వ చేసే జాడీలను శుభ్రం చేయడం పెద్ద పని.  ఎందుకంటే,  ఆ పచ్చడి జాడీల జిడ్డు, వాసన తొందరగా వదలవు. ఎంత శుభ్రం చేసినా.. నూనె జిడ్డు, ఘాటైన వాసన తొందరగా వదలవు.  కానీ,  కొన్ని సులభమైన పద్ధతులను వాడితే.. సులభంగా ఆ వాసనను వదిలించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం… 

23
వేడి నీళ్లు..

పచ్చడి జాడీలో ముందుగా గోరు వెచ్చని  నీళ్లు నింపాలి. తర్వాత.. డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే వదిలేయాలి.  ఆ తర్వాత బ్రష్ తో రుద్ది.. నీటితో కడగాలి. 

బేకింగ్ సోడా…

పచ్చడి జాడీలో గోరు వెచ్చని నీళ్లు, 1 నుంచి 2 టీ స్పూన్ల బేకింగ్ సోడి వేయాలి. 20 నిమిషాల తర్వాత ఆ జాడీకి మూత పెట్టి.. బాగా ఊపాలి.  ఇలా చేయడం వల్ల మరకలు, జిడ్డు ఈజీగా వదులుతాయి.

వెనిగర్..

వైట్ వెనిగర్, గోరు వెచ్చని నీటిని సమానంగా కలిపి జాడీలో పోయాలి. 30 నిమిషాలు అలానే ఉంచాలి. ఇలా చేయడం జిడ్డు, మసాలా వాసన కూడా తొందరగా పోతుంది.

నిమ్మకాయ..

నిమ్మకాయను సగానికి కోసి.. దానికి ఉప్పు రాసి.. జాడీ మూతకు, సీసా లోపల అన్నీ రుద్దాలి. ఇలా చేయడం వల్ల సీసా జిడ్డుదనం పోవడంతో పాటు.. ఘాటు వాసన కూడా పోతుంది. కడిగిన తర్వాత జాడీని మంచి ఎండలో ఆరబెట్టండి. సూర్యరశ్మి సహజంగా వాసనను తొలగిస్తుంది.

33
ఇలా కూడా శుభ్రం చేయవచ్చు..

గోరువెచ్చని నీళ్లు, డిష్ వాష్ లిక్విడ్, బేకింగ్ సోడా ఈ మూడింటినీ జాడీలో వేసి 20 నిమిషాలు వదిలేయండి. తర్వాత బ్రష్‌తో రుద్దండి. జిడ్డు వెంటనే పోతుంది.

వెనిగర్ లేదా నిమ్మరసం నీటితో జాడీని కడిగి ఎండలో ఆరబెట్టండి. అవసరమైతే ఈ ప్రక్రియను రెండుసార్లు చేయండి. వాసన పూర్తిగా పోతుంది. ఈ సులభమైన పద్ధతులతో మీరు పాత పచ్చడి జాడీలను కొత్తవాటిలా శుభ్రం చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories