భార్యా భర్తలన్నాకా.. గొడవలు, కొట్లాటలు చాలా కామన్. గొడవ పడ్డామని ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ప్రవర్తిస్తే మాత్రం కొన్ని రోజులకే వైవాహిక బంధం బలహీనపడే ప్రమాదం ఉంది. మనస్పర్థల కారణంగా భార్యా.. భర్తల్లో ఎవరు కోపంగా ఉన్నా.. ఎవరో ఒకరు కాస్త తగ్గి క్షమాపనలు చెప్పాలి. అయితే భార్యా భార్తల్లో చాలా మటుకు భార్యలే ఎక్కువ సేపు కోపంగా ఉంటారు. ఇలాంటి సమయంలో వారి కోపాన్ని ఎలా పోగొట్టాలో చాలా మంది భర్తలకు తెలియదు. అయితే కొన్నిసింపుల్ ట్రిక్స్ తో భార్య కోపాన్నిచిటికెలో పోగొట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
క్షమాపన చెప్పండి: చాలా మంది భర్తలు భార్యలకు క్షమాపనలు చెప్పడానికి వెనకాడుతారు. మాట్లాడకుండా ఎన్నిరోజులైనా ఉంటారు కానీ ఒక్క సారీ మాత్రం చెప్పరు. చేసిన తప్పుకు క్షమాపనలు చెప్పడంలో తప్పు లేదనడంలో గ్రహించాలి. ఒకవేళ మీరు తప్పు చేయకున్నా.. సారీ చెప్పండి. ఇది మీ బంధాన్ని ఎక్కువ రోజులు ఆనందంగా ఉంచుతుంది.
ప్రశాంతంగా మాట్లాడండి: భార్య కోపంగా ఉందని మాట్లాడటం మానేయకండి. అలాగే ఆమెను బాధపెట్టే మాటలను కూడా మాట్లాడకండి. దానివల్ల ఆమె మరింత బాధపడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు ఆమెతో ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఆమె మాట్లాడకుంటే ప్రేమగా కౌగిలించుకోండి.
relationship problems
ఆమె చెప్పేది వినండి: ఇంకా కోపం తగ్గించుకోవడం లేదని చాలా మంది భార్యలపై అరుస్తుంటారు. అలా చేస్తే వాళ్లు మరింత బాధపడతారు. కోపం మరింత పెరుగుతుంది. దీనికి బదులుగా ఆమె చెప్పే మాటలను వినండి. ఆమె సైడ్ నుంచి ఆలోచించండి. దీని వల్ల మీరు మీ తప్పులను తెలుసుకోగలుగుతారు.
ఆహాన్ని పక్కన పెట్టండి: చాలా జంటలు గొడవలు పడతారు. వాటిని పరిష్కరించుకోవడానికి అహం అడ్డొస్తుంటుంది. కోపంలో ఉన్న భార్యలు తమ బాధలను, కష్టాలను, ఇబ్బందులను చెప్పినప్పుడు వాటిని భర్తలు అంగీకరించరు. మీ తప్పులను మీరు అంగీకరించకపోతే మీ మధ్య కోపాలు, తాపాలు మరింత ఎక్కువ అవుతాయన్న ముచ్చటను గుర్తుంచుకోండి.
వంట చేయండి: కోపంగా ఉన్న భార్యను శాంతపర్చడానికి ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది. ఆమె కోసం ఆమెకు ఇష్టమైన వంటను చేసి మీ చేతులతో పెట్టండి. దీనివల్ల ఆమె ఎంతో సంతోషిస్తుంది.
షాపింగ్ కు తీసుకెళ్లండి: షాపింగ్ ను ఇష్టపడని ఆడవారుండరు. సో మీ భార్య కోపం తగ్గించేందుకు ఆమెను మంచి షాపింగ్ మాల్ కు తీసుకెళ్లండి. దీంతో ఆమె మానసిక స్థితి కుదుటపడి కోపమంతా పోతుంది.