Liver Health: కాలేయం ఆరోగ్యం మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఎక్కువగా మద్యం తాగడం, ఊబకాయం, డయాబెటిస్, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఈ సమస్య వస్తుంది.
కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే ఫ్యాటీ లివర్ సమస్య వచ్చిందని అంటారు. మద్యం, ఊబకాయం, డయాబెటిస్, చెడు జీవనశైలి వల్ల ఈ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినా కూడా మొదట్లో లక్షణాలు కనిపించవు. కానీ నీరసం, కడుపునొప్పి, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం వంటివి కనిపిస్తే అనుమానించాల్సిందే. ఫ్యాటీ లివర్ రావడానికి మనం తినే ఆహారమే కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు రోజూ ఇచ్చే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు కాలేయ వ్యాధులకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
25
వైట్ బ్రెడ్
వైట్ బ్రెడ్‌ను శుద్ధి చేసిన మైదాతో తయారు చేస్తారు. ఇది శరీరంలోకి వెళ్లగానే వేగంగా చక్కెరగా మారుతుంది. దీన్ని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ అదనపు చక్కెర కాలక్రమేణా కొవ్వుగా మారి లివర్‌లో పేరుకుపోయి ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది.
35
కేకులు, పేస్ట్రీలు
పేస్ట్రీలలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషకాలు తక్కువ, కేలరీలు ఎక్కువ. వీటిని తరచుగా తినడం వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చాలా బ్రేక్‌ఫాస్ట్ తృణధాన్యాలలో చక్కెర, శుద్ధి చేసిన ధాన్యాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీనివల్ల ఎక్కువగా తినేస్తాం. ఈ అదనపు చక్కెర లివర్‌లో కొవ్వుగా నిల్వ ఉండి, ఫ్యాటీ లివర్‌కు కారణమవుతుంది.
55
డీప్ ఫ్రై వంటకాలు
డోనట్స్‌ను సాధారణంగా నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. శుద్ధి చేసిన పిండి, చక్కెరతో తయారు చేస్తారు. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, కేలరీలు ఎక్కువ, పోషకాలు సున్నా. వీటిని తరచుగా తింటే లివర్‌లో కొవ్వు పెరిగి, కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. శుద్ధి చేసిన పిండితో పాస్తాను తయారు చేస్తారు. ఇది త్వరగా గ్లూకోజ్‌గా జీర్ణమవుతుంది. పాస్తాను ఎక్కువగా తింటే, ఆ అదనపు కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మారి లివర్‌లో పేరుకుపోతాయి. ఇది ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది.