మీకు గుండె జబ్బులు రాకూడదంటే.. వారానికి రెండు సార్లు దీన్ని తినండి చాలు..

Published : Aug 29, 2022, 10:41 AM IST

వారానికి రెండు సార్లు అవకాడోలను తింటే చాలు గుండెజబ్బుల ప్రమాదం చాలా తగ్గుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. అవకాడోలను తినడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.   

PREV
18
 మీకు గుండె జబ్బులు రాకూడదంటే.. వారానికి రెండు సార్లు దీన్ని తినండి చాలు..

ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనిబారిన 25 నుంచి 30 ఏండ్ల యువత కూడా పడుతున్నారు. అయితే ఓ కొత్త అధ్యయనం గుండె జబ్బులను తగ్గించే ఆహారాలను కనుగొన్నారు. వారానికి రెండు సార్లు అవకాడోను తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. 

28

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించబడినిన అధ్యయనం ప్రకారం... మొక్కల ఆధారిత అసంతృప్త కొవ్వులను తినడం వల్ల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు దూరమవుతాయట. ఈ పరిశోధనలో 68,786 మహిళలు, 41,701 మంది పురుషులు పాల్గొన్నారు. ఈ పరిశోధనలో అధిక మొత్తంలో అవకాడోలను తినడం వల్ల గుండెకు సంబంధించిన రోగాలు, కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి రోగాలొచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది.  అయితే ఈ అవకాడోలను కేవలం వంటకే కాదు చర్మానికి, జుట్టుకు కూడా వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 
 

38

గుండె జబ్బులకు దారితీసే కారకాలు

ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. అంతేకాదు శీతల పానీయాలు, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు, శుద్ది చేసిన నూనె, చెడు జీవనశైలి వంటివి కూడా గుండె జబ్బులకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

48

ఇకపోతే అవకాడోల్లో మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. 

58
avocado

అవకాడోలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

అవకాడోల్లో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ, విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం, ఫోలెట్ లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ ను ప్రమాదాన్ని తగ్గించడంతో పాటుగా డిప్రెషన్ ను కూడా తగ్గిస్తాయి. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తాయి. 
 

68

అవకాడోలు అందుబాటులో లేకుంటే తీసుకోవాల్సిన ఆహారాలు

అవకాడోలు మన దేశంలో పండవు. కానీ వీటిని మన దేశం దిగుమతి చేసుకుంటుంది. అందుకే మార్కెట్ లో వీటికి చాలా రేటు ఉంటుంది. అయినా మన దేశంలో ఇవి అంత సులువుగా లభించవు. ఇవి దొరకనప్పుడు వీటికి బదులుగా ఏవి తినాలో తెలుసుకుందాం పదండి. 

గుడ్లు

గింజలు

కొబ్బరి గుజ్జు

Virgin coconut oil

78

గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే మీరు తినే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మీ రోజు వారి ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రక్తంలో చక్కెర స్థాయిలు మోతాదులోనే ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది గుండెను రిస్క్ లో పడేస్తుంది. 

88

గుండెకు ఆరోగ్యకరమైన కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్ వంటి మోనోశాచురేటెడ్ కొవ్వులు చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories