Amla Pickle Recipe: టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి.. సింపుల్ రెసిపీ మీకోసం!

Published : Oct 13, 2026, 04:47 PM IST

Amla Pickle Recipe: ఉసరికాయ పచ్చడి అంటేనే చాలామందికి నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ ఉసిరికాయ పచ్చడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఉసరికాయ పచ్చడి రెసిపీ

ఉసిరికాయ అనగానే ముందుగా గుర్తొచ్చేది దాని పుల్లటి రుచి, అందులోని పోషకాలు. కొంతమంది ఉసిరికాయను అలాగే తింటారు. మరికొందరు ఊరగాయ చేసుకొని తింటారు. అయితే ఈ ఊరగాయను బయట కొనేకంటే ఇంట్లోనే రుచిగా తయారుచేసుకోవడం చాలా ఈజీ. వేడి వేడి అన్నం, పెరుగన్నం, చద్దన్నంలోకి ఈ ఊరగాయ భలేగా ఉంటుంది. మరి ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

26
కావాల్సిన పదార్థాలు

ఉసిరికాయలు - 500 గ్రాములు

చింతపండు - కొద్దిగా

వెల్లుల్లి - ఒక గుప్పెడు

కరివేపాకు - ఒక రెమ్మ

నువ్వుల నూనె లేదా పల్లి నూనె - తగినంత

పోపు, మసాలా కోసం- ఆవాలు - 2 టీస్పూన్లు,

మెంతులు - 1 టీస్పూన్

ఇంగువ - అర టీస్పూన్

కారం - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

పసుపు - అర టీస్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

36
ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం
ముందుగా ఉసిరికాయలను నీళ్లలో శుభ్రంగా కడిగి, మురికి లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పొడి బట్టతో తుడవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇడ్లీ ప్లేట్లలో ఉసిరికాయలను పెట్టి సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. ఉసిరికాయలు మెత్తగా ఉడికిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి.
46
మిక్స్ చేసుకోవడం

ఉసిరికాయలు చల్లారిన తర్వాత వాటిలోని గింజలను తీసేయాలి. ఆ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి కాస్త కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఊరగాయకు మంచి రుచి వస్తుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయకుండా ఆవాలు, మెంతులు వేసి సన్నని మంట మీద వేయించాలి. మంచి సువాసన రాగానే దించి చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేసుకోవాలి.

56
పోపు చేసే విధానం

అదే కడాయిలో నువ్వుల నూనె లేదా పల్లి నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి కాస్త బంగారు రంగులోకి మారేదాకా వేయించి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. చివరగా ఇంగువ కలుపుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో కచ్చాపచ్చాగా రుబ్బి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో చింతపండు నానబెట్టి, వడకట్టి తీసిన చిక్కటి గుజ్జును వేయాలి.

66
టేస్టీ ఊరగాయ రెడీ

చింతపండు గుజ్జు ఉసిరికాయతో బాగా కలిసిపోయి తడి తగ్గాక, ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు-మెంతుల పొడిని వేయాలి. దాంతో పాటే కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అన్ని పదార్థాలు బాగా కలిశాక, ఊరగాయ దగ్గరపడే వరకు సన్నని మంట మీద ఉడికించాలి. నూనె నెమ్మదిగా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అంతే, పుల్లగా, కారంగా ఉండే ఉసిరికాయ ఊరగాయ రెడీ. దీన్ని గాజు సీసాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories