వంట చేసే గిన్నెలు శుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు వంట చేసేటప్పుడు పాత్రలు మాడిపోతుంటాయి. మాడిపోయిన పాత్రను శుభ్రం చేయడం నిజంగా సవాలుగా ఉంటుంది. చేతులు నొప్పి పుట్టేలా శుభ్రం చేసినా దానిపై పేరుకుపోయిన మరకలు పోవు.
దీని కోసం ముందుగా మాడిపోయిన పాత్రను స్టవ్ మీద పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. తర్వాత అందులో ఒక స్పూన్ వెనిగర్, సోడా ఉప్పు వేసి బాగా కలపాలి. నీటిని బాగా మరిగించండి. నీళ్లు మరిగేటప్పుడు పాత్రకు అంటిన మరకలన్నీ పోతాయి. ఆ మరక నీటితో కలిసిపోతుంది.
ఇది కూడా చదవండి: నోరూరించే చెట్టినాడ్ బిర్యానీ ఇంట్లోనే ఇలా తయారు చేయండి
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. మురికిగా ఉన్న ఆ నీటిని కిందకు వంపేయండి. తర్వాత పాత్ర వేడిగా ఉన్నప్పుడే అందులో రాళ్ల ఉప్పు, పాత్రలు కడిగే సబ్బు లేదా లిక్విడ్ వేసి బాగా రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేయండి. ఇప్పుడు చూస్తే మాడిపోయిన పాత్ర కొత్తదానిలా తళతళ మెరిసిపోతుంది.