Dust allergy: డస్ట్ అలెర్జీతో బాధపడుతున్నారా..? వీటిని తినండి వెంటనే తగ్గుతుంది..

First Published Aug 6, 2022, 10:58 AM IST

Dust allergy: చాలా మంది డస్ట్ అలెర్జీతో ఇబ్బంది పడుతుంటారు. ఇది చాలా చిన్న సమస్యగా కనిపించినప్పటికీ.. తీవ్రమైన అలెర్జీలకు దారితీస్తుంది. అందుకే దీనికి సకాలంలో చికిత్స తీసుకోవాలి. 

dust allergy

ఇంటి లోపలా, బయట ఉండే ధూళి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మన ఇళ్లు నీట్ గా అనిపించినా కంటికి కనిపించని ధూళి కణాలు ఎన్నో ఉంటాయి. ఇలాంటి ధూళి కణాలు, కాలుష్య కారకాల వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. 
 

ఇంటిలోపలుండే చెడు గాలి ఎన్నో శ్వాస సమస్యలకు కారణమవుతుంది. ఇది ఆస్తమాకు సంబంధించింది కూడా. ఒక వేళ మీకు డస్ట్ అలెర్జీ ఉంటే.. మీ రోజు వారి ఆహారంలో వీటిని చేర్చండి. ఇవి డస్ట్ అలెర్జీ సమస్యను పోగొడుతాయి.

తేనె

తేనే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలెర్జీ లక్షణాలను తగ్గిస్తాయి. సమస్యను పూర్తిగా పోగొడుతాయి. కాబట్టి  ఈ సమస్య ఉన్నవారు రెగ్యులర్ గా తేనెను తీసుకోండి.
 

పసుపు 

పసుపును కొన్ని ఏండ్ల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే ఔషదగుణాలు ఎన్నో రోగాలను తగ్గిస్తాయి. దీనిలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే డస్ట్ అలెర్జీతో బాధపడే వారు పసుపును ఖచ్చితంగా తీసుకోవాలి. తాగే పాలలో, ఫుడ్ లో పసుపును జోడిస్తే తొందరగా సమస్య తగ్గుతుంది. 
 

అల్లం

డస్ట్ అలెర్జీని తగ్గించేందుకు అల్లం బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. డస్ట్ అలెర్జీ వల్ల కలిగే నాసికా వాపు సమస్యను తగ్గించడంలో అల్లం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాబట్టి మీ ఆహారంలో అల్లాన్ని చేర్చడం మర్చిపోకండి.
 

టొమాటో

టమోటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది.  ఇది మన కణాలను రక్షించడానికి, వాటిని నయం చేయడానికి సహాయపడుతుంది. 
 

గ్రీన్ టీ

గ్రీన్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల జీవక్రియలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది. అలాగే వేగంగా బరువు తగ్గుతారు. గ్రీన్ టీ ని తాగడం వల్ల .. అలర్జీల వల్ల కలిగే శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి.

వెల్లుల్లి 

వెల్లుల్లి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. వెల్లుల్లిని పచ్చిగా లేదా వంటలో వేసుకుని తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.
 

దాల్చినచెక్క 

దాల్చినచెక్కను తీసుకోవడం వల్ల అలర్జీ లక్షణాలు తగ్గుతాయి. కాబట్టి దీన్ని మీ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోండి. దాల్చిన చెక్క టీ తాగినా మీ  ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదు. 
 

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఎన్నో రాకాల పోషకాలుంటాయి. ఇవి శరీరాన్ని బలంగా చేయడంతో పాటుగా.. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. మంట సమస్యను తొలగిస్తాయి. డస్ట్ అలర్జీ కూడా తగ్గిపోతుంది. 

click me!