ఖాళీ కడుపుతో టీ తాగితే ఎన్ని సమస్యలొస్తాయో తెలిస్తే.. మళ్లీ అలా తాగే సాహసం చేయరు..

Published : Jul 26, 2022, 04:56 PM IST

కాలాలతో సంబంధం లేకుండా టీ, కాఫీ లను తాగేస్తుంటారు. అయితే వీటిని ఖాళీ కడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తది జాగ్రత్త..   

PREV
18
 ఖాళీ కడుపుతో టీ తాగితే ఎన్ని సమస్యలొస్తాయో తెలిస్తే.. మళ్లీ అలా తాగే సాహసం చేయరు..

లేవగానే బెడ్ కాఫీ, టీలు తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. అందులోనూ టీ తాగనిదే కాలు కూడా కిందపెట్టరు. టీ తాగి ఆ తర్వాత బ్రస్ చేసి ఇతర ఆహారాలను తింటున్నారు. ఈ అలవాటు బాగానే అనిపించినా.. ఎన్నో రాగాలకు దారీస్తుందన్న సంగతి మీకు తెలుసా.. అవును టీని పరిగడుపున తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ అలవాటును మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

28

టీ లో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఖాళీ కడుపున టీని తాగడం వల్ల కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. అలాగే గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఇది గ్యాస్ కు దారితీస్తుంది. 

38

రోజూ పరిగడుపన టీ తాగే వారిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పాలు, పంచదార వేసిన టీ తో పాటుగా గ్రీన్ టీ కూడా పరిగడుపున తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

48

రోజుకు రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా.. బరువు కూడా సులువుగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే దీన్ని ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

58

గ్రీన్ టీ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి, బరువును తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పరిగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఖాళీ కడుపున నీరు తప్ప మరే పదార్థాలను తినకూడదు. తాగకూడదు.  
 

68

ముఖ్యంగా పరిగడుపున టీ తాగడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది.  పొత్తికడుపు నొప్పి కూడా వస్తుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ పరిగడుపున అసలే తాగడకూడు. భోజనం మధ్యలో తాగితే  ఆహారం నుంచి ఇనుము శోషణను పెంచుతుంది. 
 

78

మొత్తంగా గ్రీన్ టీ ఎప్పుడూ పరిగడుపన తాగడకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఒక్క వాటర్ ను మాత్రమే ఖాళీ కడుపున తాగాలి. గ్రీన్ టీ ని ఎప్పుడూ భోజనం తర్వాతో.. లేకపోతే భోజనం మధ్యలోనో తాగాని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

88
green tea

ఆరోగ్య ప్రయోజనాలున్నాయని గ్రీన్ టీ ఎక్కువగా తాగితే దీనిలో ఉండే టానిన్ అనే మూలకం వల్ల  కడుపులో మంట, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది మైగ్రేన్ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది. అలాగే నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories