Health Tips: ఆలివ్ ఆయిల్ తో బాడీ మసాజ్.. ప్రయోజనాలు తెలిస్తే ఉపయోగించకుండా ఉండలేరు తెలుసా..

Published : Jul 26, 2022, 03:58 PM IST

Health Tips: ఆలివ్ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్ గా ఆలివ్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేసుకుంటే బరువు వేగంగా తగ్గడంతో పాటుగా మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి.    

PREV
17
Health Tips: ఆలివ్ ఆయిల్ తో బాడీ మసాజ్.. ప్రయోజనాలు తెలిస్తే ఉపయోగించకుండా ఉండలేరు తెలుసా..

ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఆలివ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ఔషద గుణాలు జుట్టు నల్లగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి. అంతేకాదు ఈ నూనె బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

27

ఆలివ్ ఆయిల్ లో చక్కెర, పిండి పదార్థాలు, పైబర్, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని ఉపయోగించి చాలా సులువుగా బరువు తగ్గడమే కాదు.. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ లో ఉండే పాలీఫెనాల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ న కంట్రోల్ లో ఉంచుతాయి. ఇది టైప్ 2 డయాబెటీస్ ను పూర్తిగా తగ్గించడానికి సహాయపడుతుంది. 

37

ఆలివ్ ఆయిల్ తో వండిన కూరలను తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలకు అడ్డుపడతాయి. ఇంతేకాదు ఆలివ్ ఆయిల్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అయితే ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే కూడా ఎన్నో సమస్యలు తగ్గిపోతాయన్న సంగతి మీకు తెలుసా..? 
 

47

ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

మానసిక సమస్యలు తొలగిపోతాయి..

రెగ్యులర్ గా ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల ఎన్నో మానసిక సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా ఈ మసాజ్ వల్ల చిత్తవైకల్యం, ఆల్జీమర్స్ వంటి సమస్యలు పూర్తిగా వదిలిపోతాయి. అంతేకాదు ఈ మసాజ్ తో డిప్రెషన్ కూడా తగ్గుతుంది. 

57
olive oil

డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది

ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల డయాబెటీస్ లో వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. 

67

శరీర వాపును తగ్గిస్తుంది

ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర వాపును తగ్గిస్తుంది. అంతేకాదు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ ప్లేస్ లో ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే వాపు, నొప్పి, మంట తగ్గుతుంది. 
 

77

బరువు తగ్గుతుంది

ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెతో రెగ్యులర్ గా బాడీ మసాజ్ చేస్తు మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో నిద్రకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. నిద్ర సమస్యలు పోతే బరువు సులువుగా తగ్గుతారు. ఎందుకంటే నిద్రలేమి సమస్య ఉన్న వారు విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే రెగ్యులర్ గా ఆలివ్ ఆయిల్ తో బాడీ మసాజ్ చేస్తే బరువును సులువుగా తగ్గుతారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories