Stubborn Pimples: 7 డేస్ ఛాలెంజ్..జీవితంలో మొటిమలు, యాక్నే రాదు.

Published : Sep 22, 2026, 02:58 PM IST

Stubborn Pimples: మొటిమలు, యాక్నేతో ఇబ్బంది పడుతున్నారా? స్కిన్ కేర్ చేసినా, స్పాట్ ట్రీట్మెంట్స్ ఉపయోగించినా మొటిమలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో చర్మంపై మాత్రమే కాకుండా ఆహారం, జీవనశైలి వంటి ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

PREV
15
7 డేస్ హెల్దీ ఛాలెంజ్

వాతావరణ పరిస్థితులు, జీవనశైలి, ఫుడ్ వల్ల ముఖం మీద మొటిమలు, యాక్నే వంటివి వచ్చి చిరాకు పెడుతుంటాయి. ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా, స్కిన్ కేర్ రోటీన్ చేసుకున్నా...వస్తూనే ఉంటాయి. దానివల్ల బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఒక్కసారి ఈ 7 డేస్ హెల్దీ ఛాలెంజ్ ట్రై చేయండి. ఇంక జీవితంలో మొటిమలు రావు.

25
ఎలా తయారు చేసుకోవాలి?

ముందుగా 3–4 లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం వాటిని మెత్తగా నూరుకోవాలి. అందులో కొద్దిగా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా తాజా వేప ఆకుల పేస్ట్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

35
మొటిమలకు ఇది ఎలా ఉపయోగపడుతుందంటారు?

లవంగాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. వేపను సంప్రదాయంగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తారు. తేనె, నిమ్మరసం తినే ఆహారంలో ఉపయోగిస్తారు.

45
7 రోజుల్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా?

ఈ రెమెడీని క్రమంగా తీసుకుంటే యాక్నే, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యల్లో మార్పు కనిపించవచ్చని చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరి చర్మ స్వభావం, హార్మోన్లు, ఆహారం, లైఫ్ స్టైల్, యాక్నే తీవ్రత రకరకాలుగా ఉంటాయి. కాబట్టి కేవలం 7 రోజుల్లో మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పలేం. మొటిమల సమస్యను నియంత్రించడానికి తగినంత నీరు తాగడం, సాత్విక ఆహారం తీసుకోవడం, వేపుళ్లు, కారాలు ఉండే ఆహారాన్ని తగ్గించుకోవాలి.

అయితే మొటిమలు ఎక్కువగా ఉండటం, బాధాకరంగా మారడం, మచ్చలు పడటం లేదా పదే పదే రావడం వంటి పరిస్థితుల్లో స్వయంగా రెమెడీలను ప్రయత్నించడం కంటే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించడం మంచిది. గర్భిణీలు లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు కొత్త ఆహార రెమెడీని ప్రయత్నించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.

55
వైద్యుల సలహా తీసుకోవాలి

అయితే వీటిని కలిపి ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మొటిమలు తప్పకుండా తగ్గుతాయని చెప్పడానికి తగిన క్లినికల్ ఆధారాలు లేవు. ఒక్కొక్కరి స్కిన్ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఈ కంటెంట్‌లోని సమాచారం, సూచనలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత కలిగిన వైద్య నిపుణుడి సలహాకు ప్రత్యామ్నాయం కాదు.

Read more Photos on
click me!

Recommended Stories