Black Coffee: రోజూ ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగండి.. ఈ ప్రాణాంతక వ్యాధులేవీ రావు

Published : Sep 04, 2026, 03:09 PM IST

Black Coffee: రోజూ బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. ఎవరైతే ప్రతిరోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగుతారో వారిలో ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

PREV
13
రోజూ ఓ కప్పు బ్లాక్ కాఫీతో లాభాలు

రోజూ బ్లాక్ కాఫీ తాగితే ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. ఇది కాలేయానికి హాని చేసే కణజాలం ఏర్పడటాన్ని, మచ్చలు పడటాన్ని నివారిస్తుంది.

చక్కెర లేని బ్లాక్ కాఫీ బరువు తగ్గడానికి సాయపడుతుంది. దీనిలోని కెఫిన్ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది. కానీ కాఫీలో చక్కెర, క్రీమ్ కలిపితే కేలరీలు పెరిగిపోతాయి.

బ్లాక్ కాఫీ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టును పల్చగా మార్చే DHT హార్మోన్ ప్రభావాన్ని అడ్డుకుంటుంది. దీంతో జుట్టు మృదువుగా, మెరుస్తూ ఆరోగ్యంగా పెరుగుతుంది.

23
కాఫీ కిడ్నీల ఆరోగ్యానికి మంచిదేనా?

రోజుకు 1 నుంచి 3 కప్పుల కాఫీ తాగడం సురక్షితమే. ఇది కిడ్నీల ఆరోగ్యానికి కూడా రక్షణ కల్పిస్తుంది. కానీ, మోతాదుకు మించి తాగితే రక్తపోటు, పొటాషియం స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.

ఉదయాన్నే ఓ కప్పు బ్లాక్ కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇది డిమెన్షియా ముప్పును తగ్గిస్తుంది. రోజూ బ్లాక్ కాఫీ తాగేవారిలో పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 60 శాతం వరకు తగ్గుతుంది.

33
పొట్ట దగ్గర కొవ్వును కరిగిస్తుంది

వ్యాయామానికి 30 నిమిషాల ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే జిమ్‌లో ఎక్కువసేపు కష్టపడొచ్చు. ఫలితంగా బరువు తగ్గుతారు. ఇది జీవక్రియను 50 శాతం పెంచి, పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది.

రోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. కాఫీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

మూడ్ మెరుగుపర్చుకోవడానికి, ఉత్సాహంగా ఉండటానికి బ్లాక్ కాఫీ తాగడం మంచి మార్గం. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, ఒత్తిడి, డిప్రెషన్‌ను దూరం చేసే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories