టాబ్లెట్లను ముక్కలు చేసి వేసుకోవచ్చా? అలా వేసుకోవడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా?

Published : Sep 04, 2026, 12:45 PM IST

చాలామందికి టాబ్లెట్లు మింగేందుకు కష్టపడతారు. పెద్ద ట్యాబ్లెట్లను రెండు ముక్కలుగా విరిచి లేదా పొడి చేసి వేసుకుంటారు. కానీ అలా చేయడం మంచిదేనా? అలా ముక్కలు చేసిన మందులు పనిచేస్తాయా?

PREV
13
ట్యాబ్లెట్లు ముక్కలు చేసి వేసుకోవచ్చా?

కొంతమందికి టాబ్లెట్లు మింగడం భయం. పెద్ద సైజులో ఉంటే మరీ భయపడతారు. అందుకే చాలామంది టాబ్లెట్‌ను సగానికి విరిచి వేసుకుంటారు. మరికొందరైతే పొడి చేసి నీళ్లలో కలిపి తాగుతారు. ఎలాగైనా కడుపులోకి వెళ్తే చాలనుకుంటారు. కానీ అన్ని టాబ్లెట్లను ఇలాగే వేసుకోవచ్చా? అలా చేస్తే ఏమవుతుంది? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

టాబ్లెట్లలో చాలా రకాలుంటాయి. అందుకే అన్నింటినీ విరిచి వేసుకోవడం సేఫ్ కాదు. అమెరికాకు చెందిన 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' (FDA) ప్రకారం, డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ సలహాతో కొన్నింటిని మాత్రమే విరవాలి. ముఖ్యంగా, టాబ్లెట్ మధ్యలో గీత (స్కోర్ లైన్) ఉన్నంత మాత్రాన దాన్ని విరవొచ్చని అనుకోకూడదని FDA స్పష్టం చేస్తోంది.

23
ఎంత ప్రమాదమో?
కొన్ని టాబ్లెట్లపై ప్రత్యేకమైన పూత (కోటింగ్) ఉంటుంది. దీనివల్ల మందు నెమ్మదిగా శరీరంలోకి వెళ్తుంది. వీటిని విరిస్తే, మందు ఒక్కసారే విడుదలై ఓవర్‌డోస్ అయ్యే ప్రమాదం ఉంది. 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ సేఫ్ మెడికేషన్ ప్రాక్టీసెస్' (ISMP) ప్రకారం, ఎక్స్‌టెండెడ్-రిలీజ్, సస్టెయిన్డ్-రిలీజ్, కంట్రోల్డ్-రిలీజ్, మోడిఫైడ్-రిలీజ్ వంటి టాబ్లెట్లను అస్సలు విరవకూడదు. అలా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ పెరిగి, అవసరమైనప్పుడు మందు ప్రభావం తగ్గిపోతుంది.
33
ట్యాబ్లెట్లపై ప్రత్యేక పూత

అలాగే, 'ఎంటెరిక్-కోటెడ్' లేదా 'గ్యాస్ట్రో-రెసిస్టెంట్' టాబ్లెట్లను కూడా విరవకూడదు. 'నేషనల్ హెల్త్ సర్వీస్' (NHS) ప్రకారం, ఈ టాబ్లెట్లపై ఉండే ప్రత్యేక పూత (స్పెషల్ కోటింగ్) కడుపులోని యాసిడ్స్ నుంచి మందును కాపాడుతుంది. ఇవి కడుపులో కాకుండా, నేరుగా పేగుల్లోకి వెళ్లి కరుగుతాయి. వీటిని విరిస్తే ఆ పూత దెబ్బతిని, మందు కడుపులోనే రిలీజ్ అవుతుంది. దీనివల్ల మందు ప్రభావం తగ్గడమే కాకుండా, కడుపులో మంట వంటి సమస్యలు రావచ్చు.

ఏ టాబ్లెట్‌ను అయినా విరిచే ముందు, దాని పేరు, రకం, లేబుల్‌ను సరిచూసుకోవాలి. డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవడమే అత్యంత సురక్షితమైన పద్ధతి. **గమనిక:** ఇది కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఏదైనా మందును విరిచే విషయంలో మీ డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

Read more Photos on
click me!

Recommended Stories