Helmet Cleaning: రోజూ బైక్ మీద హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. దీన్ని వాడటం వల్ల అది మురికిగా, చెమట వాసనతో నిండిపోతుంది. హెల్మెట్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే హెల్మెట్‌ను క్లీన్ చేసుకోవచ్చు.
వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. దీనివల్ల హెల్మెట్ నుంచి దుర్వాసన త్వరగా రావడం మొదలవుతుంది. ఇది చికాకు కలిగించడమే కాకుండా, చర్మం, జుట్టుకు కూడా హాని కలుగుతుంది. ఇది స్కిన్ అలర్జీలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. హెల్మెట్‌లోని తేమ వల్ల బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. అందుకే ఇంట్లోనే హెల్మెట్‌ను శుభ్రం చేసుకోవాలి. కొన్ని చిట్కాల ద్వారా దీన్ని శుభ్రపరచుకోవచ్చు.
24
విడి భాగాలను క్లీన్ చేయండి
హెల్మెట్‌ను శుభ్రం చేసే ముందు, దాని మాన్యువల్ చెక్ చేయండి. ఏయే భాగాలను తీసి మళ్లీ పెట్టవచ్చో చూడండి. సరైన అవగాహన లేకుండా అన్ని భాగాలను తీయడానికి ప్రయత్నిస్తే హెల్మెట్ పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జాగ్రత్తగా దాని భాగాలను విడదీయండి. హెల్మెట్ భాగాలను శుభ్రంగా షాంపూతో క్లీన్ చేయండి. హెల్మెట్ పై ఉండే మురికి, దుమ్మును మైల్డ్ డిటర్జెంట్ లేదా బేబీ షాంపూతో చేతితో ఉతకాలి. ఒకవేళ లైనర్లు తీయలేనివి అయితే, యాంటీ-బ్యాక్టీరియల్ స్ప్రేతో శుభ్రం చేయండి. తర్వాత తడి గుడ్డతో తుడవండి. ప్యాడ్లు, లైనర్లను గాలికి ఆరబెట్టాలి. హెయిర్ డ్రైయర్ లేదా ఎండలో నేరుగా ఆరబెట్టకూడదు.
34
ఇలా క్లీన్ చేయండి
ప్రతి రైడ్ తర్వాత హెల్మెట్ బయటి భాగాన్ని శుభ్రం చేయాలి. మైక్రోఫైబర్ క్లాత్, సబ్బు నీటితో తుడిస్తే దుమ్ము, ధూళి, పురుగుల మరకలు పోతాయి. మొండి మరకలు ఉంటే, ఆ ప్రదేశంలో 10-15 నిమిషాల పాటు తడి గుడ్డను ఉంచి, ఆ తర్వాత శుభ్రం చేయండి. కఠినమైన క్లీనర్లు, గరుకుగా ఉండే బట్టలు వాడొద్దు.
ఒకసారి కొన్న హెల్మెట్‌ను జీవితాంతం వాడలేరు. ప్యాడింగ్ అణిగిపోయినా, లూజ్‌గా మారినా, లేదా శుభ్రం చేశాక కూడా వాసన వస్తున్నా.. కొత్త హెల్మెట్ కొనడం మంచిది. అలాగే, వాసన పోవాలని సువాసనగల స్ప్రేలను ఎక్కువగా వాడొద్దు. అవి బ్యాక్టీరియా, తేమ సమస్యను పరిష్కరించలేవు.