ఉల్లిపాయ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుందా..?

First Published Sep 12, 2022, 10:59 AM IST

ఉల్లి మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో మన దేశంలో డయాబెటీస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే చికిత్స ఇంకా అందుబాటులో లేదు. అందుకే దీని బారిన పడితే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడాలి. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఆహారమే కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహులు తినే ఆహారం, శరీర బరువు, జీవనశైలి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వు , కేలరీలు తక్కువగా ఉండి.. ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం డయాబెటీస్ ను నియంత్రించడంలో సహాయపడతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

ఉల్లిపాయ పాయలు లేని కూరలు దాదాపుగా ఉండవేమో. ఎందుకంటే ఉల్లి కూరలను మరింత రుచిగా చేస్తుంది. అంతేకాదండో ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

onion

ఉల్లిపాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఉల్లిపాయలోని ఉండే కొన్ని రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయల్లో అధిక సాంద్రతలో కనిపించే క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్ డయాబెటిస్ లక్షణాలను తగ్గించగలదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఉల్లిపాయలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఫైబర్, ఐరన్, విటమిన్ సి, ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఎడిఎ) షుగర్ పేషెంట్లు పిండి పదార్థాలు లేని కూరగాయలను ఎక్కువగా తినాలని చెబుతోంది. ఎందుకంటే వీటిలో కార్భోహైడ్రేట్లు, కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఉల్లిపాయలు వంటి పిండి పదార్థాలు లేని కూరగాయలను రోజుకు మూడు పూటలా తినాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక కప్పు కంటే ఎక్కువ ఉడికించిన లేదా రెండు కప్పుల ముడి ఉల్లిపాయలు తినడం వల్ల కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయల్లో మన శరీరానికి కావాల్సిన  బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతుంది. దీంతో గుండె జబ్బులు, గుండె పోటు వంటి ప్రమాదాలు తగ్గుతాయి. 
 

click me!