వీటిని తింటే జుట్టు ఇక ఊడిపోయే సమస్యే ఉండదు..

Published : Sep 11, 2022, 04:33 PM IST

జుట్టుకు పోషకాలు చాలా అవసరం. జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎంతో అవసరమవుతాయి. సరైన పోషకాలు తీసుకోకుంటేనే జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. విపరీతంగా ఊడిపోతుంది.   

PREV
16
 వీటిని తింటే జుట్టు ఇక ఊడిపోయే సమస్యే ఉండదు..
hair fall

ఒత్తైన, బలమైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ జుట్టు కోసం సంరక్షణ చర్యలు తీసుకునే వారు చాలా తక్కువే. అందుకే నేడు చాలా మంది హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కానీ మనం తినే ఆహారమే మన జుట్టు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. జుట్టు ఒత్తుగా, బలంగా పెరగడానికి పోషకాహారం చాలా అవసరం. అందుకే మీరు తినే ఆహార పదార్థాల్లో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఉండేట్టు చూసుకోండి. హెల్తీ ఫుడ్ ను తింటేనే మీ జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. జుట్టు పెరిగేందుకు ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో తెలుసుకుందాం పదండి.. 

26

బచ్చలి కూర

బచ్చలి కూర జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. దీనిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, పొటాషియం, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలి కూరలో ఉండే ప్రోటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని ఆపుతాయి. అలాగే జుట్టు పెరగడానికి కూడా సహాయపడతాయి. 
 

36

గుడ్లు

గుడ్డు సంపూర్ణ ఆహారం. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే గుడ్లు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. వీటిలో ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా అవసరం. అంతేకాదు గుడ్లు హెయిర్ ఫాల్ సమస్యను కూడా పోగొడుతాయి. అందుకోసమే రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డునైనా తినండి.  
 

46

బెర్రీలు

బెర్రీలు కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తాయి. అలాగే జుట్టును బలంగా చేసి.. పెరగడానికి సహాయపడతాయి. ఇందుకోసం బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలను ఎక్కువగా తింటూ ఉండండి. 
 

56

గింజలు

గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో మన ఆరోగ్యాన్ని రక్షించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు గింజలను తింటే జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే పొడుగ్గా పెరుగుతుంది కూడా. ముఖ్యంగా బాదం పప్పులను రోజూ కొద్ది మొత్తంలో తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. బాదం పలుకుల్లో జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, విటమిన్ బి 1, విటమిన్ బి 6 లు పుష్కలంగా ఉంటాయి. 

66

చియా విత్తనాలు

సిల్వియా హిస్పానికా మొక్క విత్తనాలే చియా గింజలు. ఈ విత్తనాల్లో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో ముఖ్యమైన ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్, జింక్, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టు ఊడిపోవడాన్ని ఆపి.. జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడతాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories