Beer Storage: ఫ్రిజ్ లో బీర్ ఎన్ని రోజులు స్టోర్ చేయచ్చు..? ఈ విషయం ఎవరికీ తెలియకపోవచ్చు

Published : Aug 25, 2026, 11:28 AM IST

Beer: బీర్ ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? ఎన్ని రోజులు ఫ్రిజ్ లోనే ఉంచుతున్నారు? అసలు. బీర్ ఎన్ని రోజులు ఫ్రెష్ గా ఉంటుందో తెలుసా? అది పాడయ్యిందని ఎలా గుర్తించాలో మీకు తెలుసా?

PREV
15
బీర్ ఫ్రిజ్ లో పెడుతున్నారా?

వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడానికి చాలామంది ముందుగానే బీర్ బాటిళ్లను తెచ్చి ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటారు. అయితే, "ఫ్రిజ్‌లో పెట్టేసాం కదా.. ఎంతకాలమైనా బానే ఉంటుందిలే!" అని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఫ్రిజ్‌లో ఉంచినా కూడా బీర్‌కు నిర్దిష్టమైన షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దాని అసలు రుచి, గ్యాస్, కిక్ ఎంతకాలం ఉంటాయి? బీర్‌ను సరిగ్గా ఎలా స్టోర్ చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

25
సీల్ తీయని బీర్ (Unopened Beer): ఎంతకాలం ఉంచొచ్చు?

సాధారణ బీర్లు: మూత తీయని బీర్ బాటిల్ లేదా క్యాన్‌ను ఫ్రిజ్‌లో (2°C నుండి 4°C ఉష్ణోగ్రత వద్ద) ఉంచితే, బాటిల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన తర్వాత కూడా దాదాపు 6 నుండి 8 నెలల వరకు పాడవకుండా ఉంటుంది.

డార్క్ , స్ట్రాంగ్ బీర్లు: ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండే డార్క్ బీర్లు ఫ్రిజ్‌లో సరిగ్గా స్టోర్ చేస్తే 1 నుండి 2 సంవత్సరాల వరకు తమ రుచిని కోల్పోవు.

క్రాఫ్ట్ బీర్ : ప్రిజర్వేటివ్‌లు, కెమికల్స్ కలపకుండా సహజంగా తయారుచేసే ‘క్రాఫ్ట్ బీర్’ షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. వీటిని తెచ్చిన 2 నుండి 3 నెలల లోపే తాగడం శ్రేయస్కరం.

35
ఓపెన్ చేసిన బీర్ (Opened Beer): ఎంత సమయం ఉంటుంది?

క్యాప్ తీసిన తర్వాత: బీర్ బాటిల్ లేదా క్యాన్ సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టినా 24 నుండి 48 గంటల (1-2 రోజులు) లోపే తాగేయాలి.

ఎందుకు త్వరగా తాగాలి?: మూత తీయగానే ఆక్సిజన్ బీర్‌తో చర్య జరిపి ‘ఆక్సిడైజ్’ అవుతుంది. దీనివల్ల అందులోని కార్బొనేషన్ (గ్యాస్, నురుగు) పూర్తిగా తగ్గిపోయి, బీర్ రుచి చప్పగా లేదా చేదుగా మారుతుంది.

45
ఫ్రిజ్‌లో బీర్ స్టోర్ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు

ఎప్పుడూ నిటారుగానే ఉంచండి: బీర్ బాటిళ్లను ఫ్రిజ్‌లో పడుకోబెట్టకూడదు. నిటారుగా పెట్టడం వల్ల బాటిల్ క్యాప్ లేదా కాప్‌తో బీర్ నేరుగా తాకదు, అలాగే ఆక్సిజన్ తో చర్య జరిపే విస్తీర్ణం తగ్గి బీర్ రుచి పాడవకుండా ఉంటుంది.

వెలుతురు పడనివ్వకండి : నేరుగా సన్ లైట్ లేదా ఎక్కువ వెలుతురు పడే చోట బీర్ ఉంచితే అది చాలా త్వరగా పాడైపోతుంది .దీనినే సైంటిఫిక్‌గా ‘Skunked Beer’ అంటారు. అందుకే బీర్ బాటిళ్లు ఎక్కువగా గ్రీన్ లేదా బ్రౌన్ కలర్‌లో ఉంటాయి.

డోర్ రాక్స్ లో పెట్టొద్దు: ఫ్రిజ్ డోర్ తరచుగా తీసి వేస్తుండటం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు వస్తుంటాయి. అందుకే బీర్‌ను డోర్ షెల్ఫ్‌లో కాకుండా లోపల మెయిన్ రాక్స్‌లో ఉంచడం మంచిది.

55
బీర్ పాడైపోయిందని ఎలా గుర్తించాలి?

మీరు తాగే బీర్ తాగడానికి పనికివస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ 3 సంకేతాలను చూడండి:

నురుగు రాకపోవడం: బాటిల్ లేదా క్యాన్ ఓపెన్ చేయగానే అస్సలు ‘ఫిజ్’ (గ్యాస్ లేదా నురుగు) రాకపోతే అది పాడైపోయిందని అర్థం.

పుల్లటి వాసన: బీర్ కాస్త పుల్లగా, కార్డ్‌బోర్డ్ లేదా కార్న్ వాసన వస్తున్నట్లు అనిపిస్తే దానిని తాగకండి.

రంగు , క్లారిటీ మారడం: బీర్ రంగు మామూలు కంటే బాగా డార్క్‌గా మారినా, లేదా అడుగు భాగంలో అవశేషాలు ఎక్కువగా కనిపిస్తున్నా అది పాడైపోయినట్లే.

Read more Photos on
click me!

Recommended Stories