హార్ట్ పేషెంట్ల ఆయుష్షు పెరగాలంటే వీటిని రోజూ తినాలి..

First Published Dec 6, 2022, 12:49 PM IST

ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్కసారి గుండెపోటు వచ్చిందంటే.. మళ్లీ అది ఏ క్షణాన వస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. రెండో సారి, మూడో సారి వచ్చిందంటే మనిషి ప్రాణాలకు గ్యారంటీ ఉండదు.
 

కొన్నేండ్ల నుంచి చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు లేదా కొరోనరీ ఆర్టరీ, అధిక కొలెస్ట్రాల్ లేదా పరిధీయ ధమనుల వ్యాధులతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇటువంటి గుండె జబ్బులు ప్రపంచంలో ఎక్కువ మంది మరణానికి ప్రధాన కారణమని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన ఆహారాలను తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను నయం చేసుకోవచ్చు. 

heart patient diet

ఆహారం గుండె జబ్బులను ఎలా ప్రభావితం చేస్తుంది?

కొన్ని సంవత్సరాల నుంచి జనాలు ఆరోగ్యకరమైన ఆహారాల కంటే.. పాణాన్ని దెబ్బతీసే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లనే ఎక్కువగా తింటున్నారు. పిజ్జా, బర్గర్లు, ఫ్రైస్ మొదలైన వాటిని తినడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నిజానికి సరైన ఆహారం తింటే మీ గుండెకు ఎలాంటి సమస్యా రాదు. ఇందుకోసం మీ రోజు వారి ఆహారంలో ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాన్ని జోడించాలి. ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు గుండె పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించబడిన విశ్లేషణ ప్రకారం.. వివిధ కారణాల వల్ల కలిగే గుండె సంబంధ వ్యాధులతో బాధపడే రోగుల ఆరోగ్యాన్ని అంచనా వేసారు. వీటిలో 67 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న 905 మంది పాల్గొన్నారు. గుండె రోగులకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎంతో మేలు చేస్తాయని అధ్యయనం గుర్తించింది.

2.4 సంవత్సరాల తర్వాత రోగులను ఫాలో-అప్ చేశారు. ఆ మధ్య కాలంలో 140 మంది హార్ట్ పేషెంట్లు వివిధ కారణాల వల్ల మరణించారు. వీరిలో 85 మంది గుండె జబ్బుల వ్యాధులతో మరణించారు. ఎక్కువ లేదా తక్కువ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉన్న రోగులతో పోలిస్తే, అధిక స్థాయిలో ఉన్నవారికి గుండె ఆగిపోవడం లేదా వివిధ కారణాల వల్ల హాస్పటల్ లో చేరే అవకాశం తక్కువగా ఉందని కనుగొనబడింది. 

గుండె రోగులకు ఆరోగ్యకరమైన ఆహారాలు 

హార్ట్ పేషెంట్లకు కొవ్వులు, అసంతృప్త కొవ్వులు, మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా -3 లు ఉత్తమ ఆహారాలు. వాల్ నట్స్, బీన్స్, చియా విత్తనాలు, సీవీడ్స్, సోయాబీన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు, ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు హార్ట్ పేషెంట్ల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి వీరి ఆయుష్షను పెంచుతాయి. ఈ ఆహారాల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

Omega 3 Fatty Acids

ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, బలమైన గుండె, బరువు నిర్వహణ, జీవక్రియలకు ఈ ఆహారాలు చాలా అవసరం. ఒమేగా -3 కొవ్వులు మంటను నివారిస్తాయి. అలాగే గుండె జబ్బులను తగ్గిస్తాయి. మాంసాహారులు సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి సీఫుడ్ లను తినొచ్చు. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాల స్థాయిలను పెంచడానికి సలాడ్లు, ఓట్ మీల్, స్మూతీలకు గింజలను జోడించొచ్చు. 

click me!