Kids Height: మీ పిల్లలు ఎత్తు పెరగాలా? ప్రతిరోజూ ఈ పనులు చేయించండి చాలు

Published : Aug 15, 2025, 12:56 PM IST

పిల్లలు ఎత్తు పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే వారితో ఎలాంటి పనులు చేయించడం ద్వారా ఎత్తుగా పెరిగేలా చేయవచ్చో ఇక్కడ వివరించాము. ప్రతిరోజు పిల్లలు ఈ పనులు చేస్తే చాలు మంచి ఎత్తుకు పెరుగుతారు. 

PREV
15
పిల్లల ఎత్తు పెరగాలంటే ఎలా?

ప్రతి తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎంత ఎత్తు పెరుగుతారో అని ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా 13, 14 సంవత్సరాలు వచ్చేసరికి కొడుకు లేదా కూతురు సరైన ఎత్తు లేకపోతే తల్లిదండ్రుల్లో కంగారు పెరిగిపోతుంది. కొంతమంది పిల్లలు పొట్టిగా ఉండిపోతారు. మరికొందరు తల్లిదండ్రులు పొడవుగా ఉన్నా కూడా పిల్లలు మాత్రం పొడవు తగినంతగా పెరగరు. అలాంటి పిల్లల విషయంలో పాటించాల్సిన చిట్కాలు గురించి ఇక్కడ వివరించాము.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం పిల్లల తగినంత ఎత్తు పెరగకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పోషకాహారలోపమని చెబుతారు. అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయకపోవడం, సరైన నిద్ర లేకపోవడం కూడా కారణమే. అయితే జన్యు శాస్త్రం ప్రకారం తల్లిదండ్రుల ఎత్తు అనేది పిల్లల ఎత్తును ప్రభావితం చేస్తుంది. తల్లిదండ్రులు పొట్టిగా ఉంటే పిల్లలు పొట్టిగా ఉండే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అయితే తల్లిదండ్రులు సరైన ఎత్తు ఉన్నప్పటికీ కొంతమంది పిల్లలు పొట్టిగా ఉంటారు. అలాంటి వారి ఎత్తును పెంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

25
వేలాడే వ్యాయామాలు

రోజూ పిల్లల చేత ఏదో ఒక వ్యాయామం చేయించాలి. కాళ్లు వెన్నెముకను పొడవుగా చేయడం దానికి సహాయపడే వ్యాయామాలు కొన్ని ఉంటాయి. వాటిని చేయించాల్సిన అవసరం ఉంది. హ్యాంగింగ్ వ్యాయామాలు అంటే ఏదైనా పట్టుకొని వేలాడడం, బాస్కెట్ బాల్, వాలీబాల్, సైక్లింగ్ వంటివి ప్రతిరోజు చేయడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. అలాగే యోగాలో సూర్య నమస్కారాలు, భుజంగాసనాలు, తాడాసనం వంటి యోగాసనాలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. పిల్లలను ఎక్కువగా కష్టపెట్టకుండా ఈ వ్యాయామాలు చేయించేందుకు ప్రయత్నించండి.

35
తగినంత నిద్ర

శరీరం పెరగాలంటే రాత్రి పూట తగినంత నిద్ర అవసరం. ముఖ్యంగా నాణ్యమైన నిద్ర ముఖ్యం. ఈ సమయంలోనే మెదడు నుండి గ్రోత్ హార్మోన్లు స్రవిస్తాయి. రాత్రిపూట ఎంత గాఢ నిద్ర పడుతుందో అప్పుడే ఈ గ్రోత్ హార్మోను ఎక్కువగా స్రవిస్తుంది. మూడు నుంచి ఐదు ఏళ్ల పిల్లలకు రోజుకు 10 నుంచి 11 గంటల నిద్ర అవసరం పడుతుంది. ఇక ఆరేళ్ల నుంచి 13 సంవత్సరాల మధ్య గల పిల్లలకు ప్రతిరోజ 9 నుండి 11 గంటల నిద్ర అవసరం. ఇక 14 నుంచి 17 ఏళ్ల సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర అవసరం పడుతుంది. ఇలా పిల్లల నిద్రపోయేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత.

45
పోషకాహారం

పిల్లల శారీరక అభివృద్ధికి పోషకాహారం ఎంతో ముఖ్యం. ఎముకలను బలోపేతం చేసే పాలు, పెరుగు వంటి కాల్షియం ఉన్న ఆహారాలను పెట్టాలి. అలాగే ఆకుకూరను అధికంగా తినిపించాలి. వారికి విటమిన్ డి కోసం సూర్యకాంతిని కూడా అందేలా చూడాలి.అలాగే పప్పులు చికెన్, సోయా, గుడ్లు వంటివి తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఇక పండ్లలో నారింజ, ఆపిల్, అరటిపండు వంటివి కూడా తినిపించాలి. మెదడు కోసం వాల్నట్స్, బాదం వంటివి తినిపిస్తూ ఉండాలి.

55
ఒత్తిడి లేకుండా చూడండి

పిల్లల శారీరక పెరుగుదల బాగుండాలంటే ఎలాంటి ఒత్తిడి వారిపై ఉండకూడదు. ఏ విషయంలోనూ వారిపై అధిక ఒత్తిడి కలిగించకండి. ఇది హార్మోన్లు స్రవించడాన్ని ప్రభావితం చేస్తుంది. వారికి చదువు ఒత్తిడి తగ్గించేందుకు క్రీడలు, సంగీతం వంటి వాటిలో కాసేపు శిక్షణ ఇవ్వండి. టీనేజర్లు ధూమపానం, మద్యం వంటి వాటికి అలవాటు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. థైరాయిడ్ లోపాలు, విటమిన్ లోపాలు లేకుండా జాగ్రత్త పడండి.

Read more Photos on
click me!

Recommended Stories