Periods Stains: తెల్లటి డ్రెస్‌పై పీరియడ్స్ మరక పడిందా? ఈ సింపుల్ చిట్కాలతో వదిలించేసుకోండి

Published : Aug 15, 2025, 12:01 PM IST

తెల్లటి కుర్తా పైజామాలు లేదా స్కూల్ యూనిఫాంలపై పీరియడ్స్ మరకలు పడితే అవి వదలడం చాలా కష్టం. కొన్ని ఇంటి చిట్కాలు ద్వారానే ఆ మరకలను పూర్తిగా తొలగించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి. 

PREV
15
తెల్లటి వస్త్రాలపై పీరియడ్స్ మరక

తెల్లటి స్కూల్ యూనిఫామ్ లు వేసుకునే ఆడపిల్లలకు అప్పుడప్పుడు పీరియడ్స్ మరక సమస్య ఎదురవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగినులకు కూడా అప్పుడప్పుడు ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా సరే మహిళలకు పీరియడ్స్ మరకలు అనేవి ఇబ్బంది పెట్టేవే. కొన్నిసార్లు దుస్తుల నుంచి ఈ మరకలు పోయేందుకు ఇబ్బంది పడతాయి. మీరు పీరియడ్స్ మరకలను పూర్తిగా పోగొట్టుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి.

25
బేకింగ్ సోడాతో

బేకింగ్ సోడాతో పీరియడ్స్ మరకలను సులువుగా పోగొట్టుకోవచ్చు. ఒక చెంచా బేకింగ్ సోడాను ఉతికే నీటిలో కలపండి. ఆ నీటిలోనే పీరియడ్స్ మరకలు ఉన్న దుస్తులను వేయండి. కాసేపు నానబెట్టండి. ఆ తర్వాత మరకలు ఉన్నచోట చేతులతోనే బాగా రుద్దండి. తెల్లటి దుస్తులపై మరకలు త్వరగా పోతాయి.

35
నిమ్మకాయతో రుద్ది

నిమ్మకాయ కూడా పీరియడ్స్ మరకలను పోగొట్టేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్కూల్ యూనిఫామ్ నుండి పీరియడ్స్ మరకలను తొలగించాలనుకుంటే ఆ ప్రదేశంలో నిమ్మకాయతో బాగా రుద్దండి. ఆ తర్వాత నీటితో కడగండి ఇలా రెండు మూడు సార్లు చేస్తే రక్తపు మరకలు త్వరగానే తొలగిపోతాయి.

45
బ్లీచింగ్ పొడితో..

ఇంట్లో ఉండే బ్లీచింగ్ పౌడర్ తో కూడా పీరియడ్స్ మరకలను తేలికగా తొలగించుకోవచ్చు. ఇందుకోసం మీరు బకెట్ నీరు తీసుకొని అందులో బ్లీచింగ్ పౌడర్ కలపండి. ఆ తర్వాత మరకలు ఉన్న బట్టలను నానబెట్టండి. కొంత సమయం తర్వాత ఆ బట్టలను బాగా రుద్దితే మరకలు పోయే అవకాశం ఉంది.

55
ఇలా చేయండి

బాలికల నుంచి ఉద్యోగినుల వరకు ప్రతి నెలా పీరియడ్స్ మరకలు అనేవి వేధిస్తూనే ఉంటాయి. వాటిని తొలగించుకోవాలంటే ఇక్కడ మేము చెప్పిన పద్ధతులు చాలా సులభమైనవి. ఇవి ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గవి. ఉద్యోగినులు, మహిళలు పీరియడ్స్ సమయంలో తెల్లని దుస్తులు వేసుకోకపోవడమే ఉత్తమం. ఆ సమయంలో వారు ముదురు రంగు దుస్తులు వేసుకుంటే మరకలు పడినా కూడా బయటి వారికి కనిపించకుండా ఉంటాయి. ఇంకా బాలికల యూనిఫామ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేము. కాబట్టి బాలికలకు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించడమే ఉత్తమం. ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మరకలు పడే వరకు ఆగకుండా ముందుగానే ప్యాడ్ మార్చుకునే విధంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories