వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు స్టార్ట్ బటన్ నొక్కడం… తరువాత ఆఫ్ చేయడం ఈ రెండే వాడుతున్నారా? నిజానికి ఆధునిక మెషీన్లలో ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. వాటి గురించి చాలామందికి తెలీదు. ఆ వివరాలు ఇక్కడ ఇచ్చాము.
యాంటీ-రింకిల్ మోడ్ (Anti-Wrinkle Mode)
షర్టులు, ప్యాంట్లు లేదా ఆఫీస్ దుస్తులు ఉతికేటప్పుడు ఈ యాంటీ రింకిల్ మోడ్ వాడండి. ఇది బట్టలపై ముడతలు పడకుండా చూస్తుంది. ఈ మోడ్‌లో మెషీన్ చల్లటి నీటిని వాడుతుంది, స్పిన్ వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో బట్టలు సాఫ్ట్‌గా ఉంటాయి, ఐరనింగ్ చేస్తే టైమ్ కడా ఆదా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ముడతలు పడవు.
క్విక్ వాష్ మోడ్ (Quick Wash Mode)
మీరు బిజీగా ఉండే రోజుల్లో ఈ మోడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. గంట పట్టే పనిని ఇది సగం టైమ్‌కే పూర్తి చేస్తుంది. కొన్ని గంటలు మాత్రమే వేసుకున్న దుస్తులు లేదా తక్కువ మురికి ఉన్నవాటిని ఉతకడానికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే మరీ మురికిగా ఉన్న, మందపాటి బట్టలను ఈ మోడ్‌లో వేయొద్దు.