నిద్ర పట్టదు..
రాత్రిళ్లు పడుకోగానే గాఢ నిద్రపోయే రోజులు పోయి.. పదే పదే మెలకువ వస్తుంది. గాఢ నిద్రపోలేరు.అంతేకాదు.. ఉదయం లేవగానే..అలసటగా అనిపిస్తూ ఉంటుంది.
5. తగ్గని అలసట..
ఒకప్పుడు వారం రోజులు కంటిన్యూస్ గా పని చేసినా రాని అలసట.. ఇప్పుడు ఊరికూరికే వచ్చేస్తుంది. నెలల తరబడి విశ్రాంతి తీసుకున్నా కూడా ఇంకా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది.
6. బిపి, షుగర్ కొలెస్ట్రాల్..
"నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు" అని ధీమాగా ఉంటాం. కానీ బిపి, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ బయటకు ఎలాంటి లక్షణాలు చూపించకుండానే పెరిగిపోతుంటాయి. అందుకే రొటీన్ చెకప్‌లు తప్పనిసరి.
7. చిన్న విషయాలు మర్చిపోవడం..
మొన్నటి వరకు అన్ని విషయాలు గుర్తుంచుకునే వాళ్లు.. చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు గుర్తుండటం లేదా? ఇది కూడా 40 తర్వాత వచ్చే లక్షణమే. హార్మోన్లలో మార్పులు, సరిగా నిద్రపట్టకపోవడం వల్ల మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యోగా, మెడిటేషన్ లాంటివి అలవాటు చేసుకోవాలి.
8. కీళ్ల నొప్పులు త్వరగా తగ్గకపోవడం
చిన్న వెన్నునొప్పి లేదా మోకాళ్ల నొప్పులు వస్తే వారాల తరబడి అలాగే ఉండిపోతాయి. ఆర్థరైటిస్ లేదా కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్ల ఇవి దీర్ఘకాలికంగా మారతాయి. ఎముకలు కూడా బలహీనంగా మారతాయి.
అయితే.. మన శరీరంలో కనిపించే ఈ మార్పులను చూసి భయపడాల్సిన పనిలేదు. కానీ "వయసు ప్రభావం" అని నిర్లక్ష్యం చేయకుండా.. హెల్దీ డైట్, వ్యాయామం, సరైన డాక్టర్ సలహాతో మనల్ని మనం కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం!