Apple Farming: మీ పెరట్లో పొట్టి ఆపిల్ మొక్కలు ఎంత సులువుగా పెంచేయచ్చో తెలుసా.. ఇవిగో సూపర్ టిప్స్

Published : Jun 16, 2026, 05:21 PM IST

Apple Farming: ఇంటి పెరటిలో లేదా బాల్కనీలో ఆపిల్ మొక్కను ఇప్పుడు చాలా సులువు. సరైన రక్షణ తీసుకుంటే కుండీలోనే ఆపిల్ మొక్కను పెంచుకోవచ్చు.  అవి పండ్లు కూడా కాస్తాయి. వాటిని ఎలా పెంచాలో తెలుసుకోండి.

PREV
13
పొట్టి ఆపిల్ మొక్కలు

ఆపిల్ అనగానే కాశ్మీర్, సిమ్లా వంటి చోట్ల మాత్రమే పండుతాయనుకుంటాం. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంటి పెరట్లో లేదా బాల్కనీలోని కుండీలో కూడా ఆపిల్ మొక్కను పెంచుకోవచ్చు. కుండీలలో పెంచడానికి 'డ్వార్ఫ్' (Dwarf - పొట్టి రకం) ఆపిల్ మొక్కలు చాలా బెస్ట్. ఎందుకంటే ఇవి తక్కువ స్థలంలో పెరుగుతాయి. అలాగే త్వరగా కాయలు కాస్తాయి. విత్తనాలు వేస్తే పుట్టిన మొక్కల కన్నా అంటుకట్టిన (Grafted) మొక్కలను ఎంచుకోవడం చాలా మంచిది. 

ఆపిల్ మొక్కను పెంచేందుకు పెద్ద కుండీని తీసుకోవాలి. మొక్క వేర్లు బాగా పెరగాలంటే పెద్ద సైజు కుండీ అవసరం పడుతుంది. సుమారు 18 నుంచి 24 అంగుళాల లోతు ఉన్న కుండీని ఎంపిక చేసుకోవాలి. కుండీ అడుగున నీరు పోవడానికి రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. నీరు నిలిచిపోకుండా ఉండేందుకు, కుండీ అడుగున చిన్న చిన్న రాళ్లు లేదా పగిలిన కుండ పెంకులు వేయడం మంచిది.

23
మట్టి మిశ్రమం

ఆపిల్ మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే దానికి కావాల్సిన అన్ని పోషకాలు నిండిన మట్టిని వాడాలి. తోట మట్టి, కంపోస్ట్, కొద్దిగా ఇసుక కలిపి మట్టి మిశ్రమాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇది మట్టిలో గాలి ప్రసరణను పెంచి, నీరు నిలిచిపోకుండా బయటకు వెళ్లేలా చేస్తుంది.

ఆపిల్ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, పండ్లు కాయడానికి సూర్యరశ్మి చాలా అవసరం. రోజూ 6 నుంచి 8 గంటల పాటు మంచి ఎండ తగిలే చోట కుండీని ఉంచాలి. ఒకవేళ సరైన ఎండ తగలకపోతే, ఆర్టిఫిషియల్ లైటింగ్ కూడా వాడొచ్చు. మొక్క అన్ని వైపులా సమానంగా పెరగడానికి అప్పుడప్పుడు కుండీని తిప్పుతూ ఉండాలి.

33
ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఆపిల్ మొక్కకు ప్రతిరోజూ నీళ్లు పోయకూడదు. అవసరమైనంత మేరకే నీళ్లు పోయాలి. నీరు ఎక్కువగా వేస్తే వేళ్లు కుళ్లిపోవచ్చు. వేసవిలో తరచుగా నీళ్లు పోయాల్సి రావచ్చు, కానీ చలికాలంలో అవసరాన్ని బట్టి పోస్తే సరిపోతుంది. మొక్క బాగా పెరగడానికి అప్పుడప్పుడు ప్రూనింగ్ అంటే కొమ్మలను కత్తిరిస్తూ ఉండాలి. 

ఆపిల్ మొక్క పెరిగి పండ్లు కాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఓపికగా పెంచాలి. సరైన సంరక్షణ, వసతులే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, భవిష్యత్తులో మీరు ఆపిల్స్ కోయడానికి దారితీస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories