చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఏ దిక్కున పెట్టుకోవాలో తెలుసా?

First Published Jan 20, 2022, 12:38 PM IST

చనిపోయిన వారి ఆత్మశాంతి (Peace of mind) కోసం, వారి జ్ఞాపకార్థం ఇంటిలో ఫోటోలను పెట్టుకుంటారు. అయితే   చనిపోయిన వారి ఫోటోలను ఇంటిలో ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవడం మంచిదికాదని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి ఏ దిక్కున చనిపోయిన వారి ఫోటోలను (Photos of the dead) పెట్టుకుంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చనిపోయిన వారి ప్రేమానురాగాలకు (Affections) గుర్తుగా వారి ఫోటోలను ఇంటిలో పెట్టుకుని వారికి ఆత్మశాంతి చేకూరాలని రోజూ దీపం వెలిగించడం చేస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో మరణించిన వారి ఫోటోలను ఏ దిక్కున పెట్టుకుంటే మంచి ఫలితం (Good result) ఉంటుందో చెబుతోంది. ఇంటిలో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకోరాదు.
 

చనిపోయిన వారి ఫోటోలను ఎక్కువగా పెట్టుకుంటే ఇంటిలో నెగటివ్ ఎనర్జీ (Negative energy) ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే చనిపోయిన వారి ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా పూజ చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే దేవతల ఆగ్రహానికి (Anger) కుటుంబ సభ్యులు గురయ్యే అవకాశం ఉంటుంది.
 

దీంతో కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు (Difficulties), ఆందోళన ఏర్పడి ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను పడకగదిలో ఉంచరాదు. బ్రతికున్న వారి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలను ఉంచరాదు. ఇలా చేస్తే బ్రతికున్న వారి ఆయుష్షు (Ayushshu) తగ్గుతుంది. ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యులు ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది.
 

మరి ఏ దిక్కున ఇంటిలో చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఉంచడం మంచిదో అలా ఫోటోలను పెడితే ఎలాంటి శుభఫలితాలు దక్కుతాయో వాస్తుశాస్త్రం ఒక స్పష్టత (Clarity) అనేది ఇచ్చింది. వాస్తుశాస్త్రం ప్రకారం చనిపోయిన పితృదేవతల ఫోటోలను ఉత్తరంవైపు చూసే విధంగా దక్షిణం గోడకు (South wall) వేలాడదీస్తే మంచిదని చెబుతోంది. దక్షిణం గోడకు ఫోటోలను వేలాడదీస్తే వారు ఉత్తరం వైపుకు చూస్తూంటారు.
 

ఇలా వేలాడదీస్తే ఇంటి ఆవరణంలో ఉండే నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఉత్తరం దిశ నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. నెగటివ్ ఎనర్జీ తగ్గి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ (Positive Energy) ఏర్పడుతుంది. దీంతో కుటుంబ సభ్యులు ప్రశాంతంగా (Calm down), ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు. అయితే మరణించిన పితృదేవతలు అయినప్పటికీ వారిలో కొంత పైశాచిక గుణగణాలు చోటుచేసుకుంటాయి.
 

కనుక అటువంటి దోషాలు (Bugs) ఏమీ లేకుండా ఉండాలంటే పితృదేవతల ఫోటోలను దక్షిణ గోడకు వేలాడదీస్తే దానికి దూరంగా ఉండే ఉత్తరంవైపు గోడకు దక్షిణంవైపు చూసే విధంగా పంచముఖ ఆంజనేయస్వామి (Panchamukha Anjaneyaswamy) చిత్రపటాన్ని కూడా వేలాడదీయడం మంచిది. ఇలా చేస్తే ఇంట్లో ఉండే సమస్త భూత గణనాధులు తొలగిపోయి ఇంటి కుటుంబ సభ్యులకు అంతా మంచే జరుగుతుంది. పితృదేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి.

click me!