Relationship: మీ పార్ట్ నర్ మీతో ఇలా ప్రవర్తిస్తున్నారా..? దాని అర్థం ఇదే..!

First Published Jan 20, 2022, 11:03 AM IST

 అప్పటి వారు.. కన్ఫామ్ చేయలేదు అంటే.. వారు ఆ సమయంలో.. ఇంకొకరితో బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకోని ఉండొచ్చు. వారితో వెళ్లడం కుదరక.. సెకండ్ ఛాయిస్ గా.. మీతో బయటకు వస్తానని చివరి నమిషంలో చెప్పి ఉండొచ్చు.
 

మనం ప్రేమించే వ్యక్తి.. మనల్ని కాకుండా మరో వ్యక్తిని ప్రేమిస్తే మనం తట్టుకోగలమా..? ప్రతి విషయంలోనూ,. మనల్ని సెంకడ్ ఛాయిస్ గా పెట్టుకోవడాన్ని అయితే.. అస్సలు తట్టుకోలేం. మీకు కూడా మరో వ్యక్తికి ప్రముఖ్యత ఇస్తూ.. వారితో కుదరకపోతే.. మిమ్మల్ని సెకండ్ ఛాయిస్ గా పెట్టుకుంటున్నారని మీకు అనిపిస్తోంది. ఇదిగో.. ఈ కింద చెప్పిన విధంగా మీ పార్ట్ నర్ మీతో ప్రవర్తిస్తే.. వారికి ప్రతి విషయంలోనూ మీరు సెకండ్ ఛాయిస్ అని అర్థం చేసుకోవాల్సిందే

మీరు మీ భాగస్వామితో పలానా తేదీ లో బయటకు వెళ్లాలని అనుకున్నారనుకోండి. వారు ఆ పర్యటనను చివరిదాకా.. ఎటూ తేల్చకుండా చివరి నమిషంలో ఒకే చేశారనుకోండి.. కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. అప్పటి వారు.. కన్ఫామ్ చేయలేదు అంటే.. వారు ఆ సమయంలో.. ఇంకొకరితో బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకోని ఉండొచ్చు. వారితో వెళ్లడం కుదరక.. సెకండ్ ఛాయిస్ గా.. మీతో బయటకు వస్తానని చివరి నిమిషంలో చెప్పి ఉండొచ్చు.
 

ఇక.. వారు ఖాళీగా ఉన్నా కూడా.. మీరు మెసేజ్ లు చేసినా... వారు స్పందించరు. పెద్దగా రెస్పాండ్ అవ్వరు. వాళ్లు.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండి కూడా... మీతో మాత్రం మాట్లాడటానికీ, మెసేజ్ లు చేయడానికి ఆసక్తి  చూపించరు.  అలా చేస్తున్నారు అంటే కూడా.. మీరు కాస్త ఆలోచించాల్సిందే. 
 


మీరు పక్కన ఉన్నప్పుడు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ.. మీరు పక్కన లేని సమయంలో.. మీ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు అంటే.. కూడా.. వారు మరో వ్యక్తి తో మింగిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సిందే.  
 

మీకు వారు ప్రాధాన్యత ఇవ్వకుంటే.. మీరు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాలి. వారు సెకండ్ ఛాయిస్ గా.. మిమ్మల్ని సంప్రదించి.. సమయం కేటాయించాలని అనుకుంటే మాత్రం.. వారికి అంత ఛాన్స్ ఇవ్వకూడదు. మీకు నిజంగా.. వారితో ఉండాలి అని ఉంటే.. అది కూడా.. మీకు సమయం కుదిరినప్పుడు మాత్రమే.. వారితో గడపాలి.

మనకు ఒకరి పట్ల ఆసక్తి ఉన్నప్పుడు.. వారిని తలుచుకోగానే.. ముఖంలో నవ్వు వస్తుంది. వారు ఇలా ఉంటారు.. అలా ఉంటారు అని మనకు గుర్తుకు వస్తుంది.  వారు ఏమి ధరించారో కూడా మనం గమనిస్తాము.

కానీ మనం వారిలో అంతగా లేనప్పుడు,  వారు  చెప్పినదాన్ని సులభంగా మరచిపోతాము. అదేవిధంగా.. మీరు ఒకరి జీవితంలో సెకండ్ ఛాయిస్ గా ఉన్నప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు ఎంత ముఖ్యమైన విషయం చెప్పినా.. వారు మర్చిపోతూ ఉంటారు.

click me!