చిన్నారుల్లోనూ ఆందోళన... లక్షణాలు ఇవే..!

Published : Jan 20, 2022, 12:26 PM IST

చిన్నదానికీ.. పెద్దదానికీ.. ఏడుస్తూ ఉన్నారంటే మాత్రం కచ్చితంగా వారిపై దృష్టిపెట్టాలి. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారనే విషయంపై దృష్టిపెట్టాలి. వారు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతున్నారనే విషయాన్ని గుర్తించాలి

PREV
18
చిన్నారుల్లోనూ ఆందోళన... లక్షణాలు ఇవే..!

పెద్దవారిలో ఆందోళన కలగడం చాలా సహజం. వారు చేస్తున్న పని వల్ల కావచ్చు.. లేదా.. ఇంకేదైనా టెన్షన్స్ కారణంగా.. వారిలో ఎప్పుడూ ఆందోళన మొదలౌతుంది. మరి  ఇదే రకం ఆందోళన చిన్నపిల్లల్లో కూడా ఉంటుందా అంటే.... అవుననే అంటున్నారు నిపుణులు. పసిపిల్లల్లో... కనీసం మాటలు కూడా రానీ చిన్నారుల్లో కూడా ఆందోళన కలుగుతుందట.  మరి వారిలో  ఆందోళన కలుగుతుందనే విషయాన్ని.. ఈ కింది లక్షణాలతో గుర్తించవచ్చట

28

1. మీ పిల్లలు.. ఏదైనా విషయంలో ఎక్కువగా భయపడిపోతున్నారూ అంటే వారిపై మీరు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.  ఆ భయం కారణంగా.. వారు ఏ పనీ చేయలేకపోతున్నారంటూ.. వారిలో.. ఏదో తెలియని ఆందోళన మొదలైందని గుర్తించాలి.

38

2.మీ పిల్లలకు విపరీతమైన కోపం రావడం.. లేదా చిన్న విషయానికే ఎక్కువగా భయపడటం లేదంటే.. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే.. అస్సలు లైట్ తీసుకోకూడదట. కచ్చితంగా.. వారిపై దృష్టి పెట్టాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

48

3.ఇంట్లో పిల్లలు ఎడ్వడం చాలా సహజం. అలా కాకుండా.. చిన్నదానికీ.. పెద్దదానికీ.. ఏడుస్తూ ఉన్నారంటే మాత్రం కచ్చితంగా వారిపై దృష్టిపెట్టాలి. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారనే విషయంపై దృష్టిపెట్టాలి. వారు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతున్నారనే విషయాన్ని గుర్తించాలి.

58

4.ఆందోళన ఎక్కువగా ఉన్న చిన్నారులు.. తరచూ వారి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఉంటారట. ఒకసారి ఇష్టంగా తిన్న ఆహారాన్ని.. ఆ తర్వాత.. అస్సలు ముట్టుకోవడాన్ని పెద్దగా ఇష్టపడరట. అలా చేస్తున్నారంటే మాత్రం.. కచ్చితంగా వారిపై ఓ కన్ను వేయాలి.
 

68

5.రాత్రిపూట నిద్రపోయాక.. పిల్లలు ఏడుస్తున్నారు అంటే మాత్రం.. రాత్రిపూట పీడకలలు వస్తున్నాయి అంటే.. అది కూడా తరచుగా జరుగుతోంది అంటే కూడా.. పిల్లలు ఏదో విషయంలో ఆందోళన చెందుతున్నారని అర్థమట..

78

6.పిల్లలు కాసేపు మీరు కనపడకపోయినా ఏడ్వడం.. మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు అంటే కూడా.. వారు కూడా  ఆందోళనతో బాధపడుతున్నారనే విషయాన్ని మీరు గుర్తించాలి.

88

7.ఆందోళనతో బాధపడుతున్న చిన్నారులకు రాత్రిపూట ఎక్కువగా కడుపులో నొప్పి, తల నొప్పి, కాళ్ల నొప్పులు, మజిల్ పెయిన్స్ వంటి తరచుగా వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు తరచూ  చిన్నారుల్లో కనిపిస్తే.. తల్లిదండ్రులు అప్రమత్తమై.. వారి ఆందోళనను ఎలా తగ్గించాలో చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

click me!

Recommended Stories