Acne Face packs: ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నాయా? ఈ ఫేస్ ప్యాక్ వేయండి

Published : Sep 16, 2025, 10:51 AM IST

కొందరికి ఎక్కువగా మొటిమలు (Acne) వస్తూ ఉంటాయి. మొటిమలు (Pimple) తగ్గాలంటే కొన్ని రకాల ఫేస్ ప్యాక్ (Face pack)లు ఉపయోగపడతాయి. వీటికి పెద్దగా ఖర్చవ్వదు. 

PREV
16
మొటిమలకు చికిత్స

మీకు మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా?  వాటికి మీ వంటగదిలోనే చికిత్స ఉంది.  అక్కడ ఉంటే కొన్ని వస్తువులతోనే మొటిమలు తగ్గించుకోవచ్చు. వాటిని ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే మొటిమలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.

26
కలబంద ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ కోసం మీరు రెండు స్పూన్ల కలబంద గుజ్జులో కొద్దిగా గ్రీన్ టీ కలిపి ముఖానికి అప్లై చేయాలి. పావుగంట సేపు తర్వాత చల్లటి నీటితో కడగాలి. రాత్రి పడుకునే ముందు ఈ ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది.

36
బొప్పాయి ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ కోసం బాగా పండిన బొప్పాయిని మెత్తగా చేసి, కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

46
అరటి పండును ఫేస్ ప్యాక్

బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ లేదా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. చివరగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

56
ముల్తానీమిట్టి

ఒక గిన్నెలో వేపాకు పొడి, ముల్తానీ మిట్టి తీసుకోండి. దానికి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగి, చివరగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

66
ఓట్స్ పిండి

ఈ ఫేస్ ప్యాక్ కోసం 2 స్పూన్ల ఓట్స్ పొడిలో 1 స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. కావాలంటే దీనికి గ్రీన్ టీ లేదా గోరువెచ్చని నీటిని కూడా కలుపుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories