Food Coma: రాత్రి తిన్న వెంటనే నిద్రపోతున్నారా..? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే..

Published : Mar 29, 2022, 04:27 PM IST

Food Coma: తినగానే నిద్రపోతున్నారా..? అయితే మీరు ఫుడ్ కోమా వ్యాధి బారిన పడ్డట్టే.. ఈ వ్యాధి బారిన పడ్డవాళ్లు అతిగా తినడమే కాదు తొందరగా నిద్రపోతారు కూడా. ఈ వ్యాధి వల్ల ఒంటికి బద్దకం కూడా వస్తుంది. 

PREV
18
Food Coma: రాత్రి తిన్న వెంటనే నిద్రపోతున్నారా..? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే..

Food Coma: కాలానుకనుగుణంగా మార్పులు అవసరమే కానీ.. జీవనశైలీ, ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంది.  అందులోనూ ప్రస్తుత కాలంలో చాలా మంది రాత్రి సమయంలో అలా తింటున్నారో లేదో ఇలా నిద్రలోకి వెంటనే జారుకుంటున్నారు. ఇది పెద్దసమస్యగా అనిపించకపోయినప్పటికీ.. ఈ పద్దతి వారి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదట. 

28

తిన్నవెంటనే నిద్రలోకి జారుకోవడానికి ఒక కారణం ఉంది. ఇలా తిన్న వెంటనే నిద్ర ఎందుకు పోతారో తెలుసా.. ఫుడ్ కోమా అనే వ్యాధి వల్ల. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ‘Post‌prandial’ అంటారు. ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఈ వ్యాధి వస్తుంది. . దీనివల్ల అలసటకు గురయ్యి వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఇంతేకాదు ఈ సమస్య వల్ల ఒంటికి బద్దకం కూడా అంటుకుంటుంది. 

38

ఈ వ్యాధి కారణంగా ఏ పని చేయలేరు. చేయాలనిపించదు కూడా.. ఈ సమస్యకు కారణం.. వీరు తిన్న తర్వాత వీరి  Blood circulation లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయట. ఈ కారణంగానే ఇలా జరుగుతుందని.. ఈ సమస్య గురించి వర్రీ అవ్వాల్సినన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మాత్రం.. దీనికి కారణమయ్యే  ఆహార పదార్థాలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

48

కొందరి ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తిన్న వెంటనే కడుపులో Blood circulation పెరుగుతుందట. దాంతో బ్రెయిన్ కు బ్లడ్ తక్కువ మొత్తంలో సరఫరా అవుతుందట. ఈ కారణంగానే తిన్న వెంటనే పడుకుంటారని చెబుతున్నారు. ఇది కేవలం వారి అభిప్రాయం మాత్రమే. 

58

అయితే మోతాదుకు మించి తింటేనే ఫుడ్ కోమా వస్తుందని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అంటే ఫుడ్ కోమా మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుందని అర్థమవుతుంది. ఫుడ్ కోమా వ్యాధి  బారిన  పడకూడదంటే.. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే కొవ్వు ల వల్ల మనకు నిద్రను ప్రేరేపించే కొలిసిస్టోకినిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. దీంతో మీరు తిన్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. 

68

కొందరు డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నా ఫుడ్ కోమా సమస్య బారిన పడతారని పేర్కొంటున్నారు. అధికప్రోటీన్ ఆహారాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో ట్రిప్లోఫాన్ ఎక్కువయ్యి.. సెరోటోనిన్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. దీంతో మీరు తిన్నవెంటనే నిద్రలోకి జారుకుంటారు. 

78

తిన్నవెంటనే నిద్రలోకి జారుకోవడం డయాబెటీస్ కు సంకేతం కూడానట. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్టైతే వెంటనే మీ షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఆ సమస్య ఫుడ్ కోమా కాదని గుర్తించాలి. అది కేవలం డయాబెటీస్ వల్ల వచ్చిందని అర్థం చేసుకోవాలి. 

88

ఈ సమస్య రాకూడదంటే.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ ను రాత్రి పూట తీసుకోకూడదు. సమతుల్య ఫుడ్ నే తినాలి. ముఖ్యంగా మితిమీరి తినకూడదు. ముఖ్యంగా ఆరోగ్యానికి చేటు చేసే ఆహారాల జోలికి అస్సలు పోకూడదు. రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర ఉండేట్టు చూసుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories