రాజ్మా పాలక్ మసాలా రెసిపీ.. ఇంట్లోనే ఇలా టేస్టీగా తయారు చెయ్యండి!

Published : Mar 29, 2022, 03:02 PM IST

 రాజ్మా, పాలకూర శరీరానికి ఎన్నో పోషకాలు (Nutrients) అందించి ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి.  

PREV
17
రాజ్మా పాలక్ మసాలా రెసిపీ.. ఇంట్లోనే ఇలా టేస్టీగా తయారు చెయ్యండి!

ఈ రెండు పదార్థాలతో చేసుకునే రాజ్మా పాలక్ మసాలా రెసిపీ చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం రాజ్మా పాలక్ మసాలా (Rajma Palak Masala) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

27

కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాజ్మా (Rajma), రెండు కప్పుల పాలకూర (Lettuce) తరుగు, ఒక కప్పు ఉల్లిపాయ (Onion) ముక్కలు, రెండు పచ్చిమిరపకాయలు (Chilies), ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger garlic paste), సగం కప్పు టమోటా గుజ్జు (Tomato pulp), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), సగం స్పూన్ పసుపు (Turmeric).
 

37

రెండు స్పూన్ ల కారం (Chili powder), ఒకటిన్నర స్పూన్ ల గరం మసాలా (Garam masala), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక స్పూన్ కసూరీ మేథీ (Kasuri Mathi), రెండు స్పూన్ ల నిమ్మరసం (Lemon juice), రెండు యాలకులు (Cardamom), ఒక బిర్యానీ ఆకు (Biryani leaf), రెండు స్పూన్ ల క్రీమ్ (Cream), కొత్తిమీర (Coriander) తరుగు, రెండు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

47

తయారీ విధానం: ముందుగా రాజ్మాను ఆరు గంటలపాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి (Should be soaked). ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేసి వేడి (Heated) చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకులు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
 

57

ఇవన్నీ బాగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకుని తరువాత ఇందులో టమోటా గుజ్జు, ధనియాలపొడి, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గరంమసాలా వేసి బాగా కలుపుకోవాలి (Mix well). మసాలాంతా బాగా వేగిన తరువాత నానబెట్టుకున్న రాజ్మా (Soaked Rajma) గింజలను వేసి మూతపెట్టి ఆరు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
 

67

కుక్కర్ ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ఆవిరంతా (Steam) పోయాక మూత తీసి మళ్లీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ను పెట్టి ఇప్పుడు ఇందులో పాలకూర తరుగు, కొత్తిమీర తరుగు, కసూరీ మేథీ, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. పాలకూర ఉడికిన తరువాత చివరిలో క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్పైసీ పాలక్ రాజ్మా మసాలా రెడీ (Ready).
 

77

ఈ మసాలా రెసిపీ రోటీ, అన్నంలోకి కాంబినేషన్ గా బాగుంటుంది. ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ (Healthy recipe). పాలకూర, రాజ్మా గింజలను తింటే అధిక రక్తపోటు (High blood pressure) అదుపులో ఉంటుంది. అలాగే శరీరానికి కావలసిన క్యాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్ శాతం కూడా పెరుగుతుంది. అలాగే శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది.

click me!

Recommended Stories