Published : Mar 29, 2022, 03:12 PM ISTUpdated : Mar 29, 2022, 03:44 PM IST
Anxiety: కారణం లేకపోయినా.. చాలా మంది విపరీతమైన భయం, కోపం, ఆనందం , విచారం వంటి భావోద్వేగాలకు లోనవుతుంటారు. వీటి నుంచే ఆందోళన పుట్టుకొస్తుంది. ఇది భయంకరమైన మానసిక రుగ్మత. ఈ ఆందోళన కారణంగా ఒక్కో సారి చనిపోవచ్చు కూడా. ఆందోళన అనే పదం మనకు చిన్నదిగానే కనిపించినా.. దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, ఆందోళన సమస్యలతో సతమతమవుతున్నారు. ఆందోళన అనే పదం మనకు చిన్నదిగా కనిపించినా.. ఇది మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
212
ఆందోళనకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. అవును మన ఆహారపు అలవాట్లపైనే మన ఆలోచనా విధానం, ప్రవర్తన ఆధారపడి ఉంటుంది నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని అలవాట్ల వల్ల ఆందోళన విపరీంగా పెరిపోతుంది. అవేంటంటే..
312
భోజనం మానేయడం.. బరువు పెరుగుతున్నామనో లేకపోతే మరే కారణం చేతనో భోజనం మానేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ భోజనం మానేయడం వల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీంతో తలతిరగడం, చిరాకు, ఊరికే ఆందోళకు గురవడం, నీరసం వంటి సమస్యలు చుట్టుకుంటాయి.
412
కెఫిన్.. కెఫిన్ మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనలో ఆందోళన పెరుగుతుందట.
512
డీహైడ్రేషన్.. శరీరానికి సరిపడా నీళ్లను తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడాల్సి వస్తుంది. ఈ డీహైడ్రేషన్ తో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. బాడీ డీహైడ్రేషన్ కు గురైనప్పుడే శరీరం ఒత్తిడికి లోనవుతుంది.
612
వ్యాయామం.. మీరు నమ్ముతారో నమ్మరో.. మనం వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఒత్తిడి కలుగుతుందట. గంటలకు గంటలు కూర్చీకే పరిమితమైతే కూడా తీవ్రంగా ఒత్తిడి పెరుగుతుంది.
712
నిద్ర.. సర్వరోగాలకు నిద్రలేమి కారణమవుతుందని సంగతి మీకు తెలుసే ఉండాలి. కంటినిండా నిద్రలేకపోతే ఎన్నో సమస్యలను మనల్ని చుట్టుకునే ప్రమాదం ఉంది. సరిగ్గా నిద్రపోకపోతే ప్రతికూల ఆలోచనలు వస్తాయి. పనిపై శ్రద్ధ ఉండదు. ఆందోళన కూడా పెరిగిపోతుంది.
812
చక్కెర.. చక్కెరతో ఆందోళన నుంచి బయటపడొచ్చు. అది తాత్కాళికంగానే. ఆందోళన తగ్గుతుందని చక్కెరను తరచుగా తీసుకుంటే మాత్రం మీకు ఆందోళన తగ్గడమేమో.. కానీ అది మరింత ఆందోళనను పెంచుతుంది జాగ్రత్త. అంతేకాదు దీంతో మానసికంగా కూడా క్రుంగిపోయే ప్రమాదం ఉంది.
912
ఒత్తిడిని ఇలా తగ్గించండి.. ఆందోళనను పెంచే విషయాలను పక్కన పెట్టేసి.. దాన్ని తగ్గించే అలవాట్లను ఫాలో అయిపోండి..
1012
పుస్తకాలను చదవండి.. ఆందోళన కలిగినప్పుడు మీకు నచ్చిన పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవండి. మీకు తెలుసా బుక్ చదవడం ద్వారా 68 శాతం ఆందోళన తగ్గిపోతుందట. కాబట్టి ఊరికూరికే ఆందోళన పడిపోయేవారు తరచుగా పుస్తకాలను చదవండి.
1112
మ్యూజిక్.. నచ్చిన పాటతో ఒత్తిడి ఎలా అయితే దూరమవుతుందో.. ఆందోళన కూడా దూరమవుతుంది. కాబట్టి ఆందోళన సమయంలో మీ మనసుకు నచ్చిన మంచి పాటను వినండి.
1212
నడక.. నడకతో ఎన్నో సమస్యలను వదిలించుకోవచ్చు. అందులో ఆందోళన కూడా ఒకటి. మీరు శారీరకంగా చురుగ్గా ఉంటే మీకు ఎటువంటీ ఆలోచనా రాదు.. ఆందోళనా కలగదు. వ్యాయామం చేస్తే.. మన శరీరం నుంచి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. దాంతో మీరు హుషారుగా, ఉత్సాహంగా మారిపోతారు.