Watermelon వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. అయితే ఈ పండ్లను అప్పుడే జనాలు ఎక్కువగా తింటుంటారు. అయితే చాలా మంది ఈ పండ్లు వేసవిలోనే లభిస్తాయని పొరబడుతుంటారు. మీకు తెలియని విషయమేమిటంటే ఈ Watermelon లు సీజన్లతో సంబంధం లేకుండా లభిస్తాయి. అది కూడా తక్కువ ధరలోనే. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే వీటిని తినడం చాలా ఉత్తమం. ఈ పండులో 90 శాతం నీరే ఉంటుంది. సో నీళ్లను తాగని వారు ఈ పండుతో శరీరానికి కావాల్సిన నీటిని అందించొచ్చు. అలాగే ఈ పండుతో ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఎ, బి, సి, మెగ్నీషియం, పొటాషియం లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి కావాల్సిన నీరు లభించడంతో పాటుగా కండరాలు బలంగా మారి, ఎముకలు గట్టిగా తయారవుతాయి. అలాగే అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. మన శరీరంలో రక్తం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.