స్నానం చేసిన తర్వాత తలకు టవల్ చుడుతున్నారా..? ఇలా అయితే మీ జుట్టంతా ఊడిపోవడం ఖాయం..!

First Published Sep 9, 2022, 12:20 PM IST

స్నానం చేసిన తర్వాత పక్కగా జుట్టుకు టవల్ చుట్టే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా చేయడం వల్ల జుట్టు విపరీతంగా రాలడంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. 
 

మెరుగైన ఆరోగ్యానికి స్నానం చాలా అవసరం. స్నానం తోనే శరీరం పరిశుభ్రంగా మారుతుంది. అలాగే ఎన్నో రకాల జబ్బులు దూరమవుతాయి. ముఖ్యంగా స్నానం చేయడం వల్ల రీప్రెష్ గా మారుతారు. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే కొంతమంది స్నానం చేస్తే.. ఇంకొంత మంది మాత్రం సాయంత్రం వేళల్లో చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తడి జుట్టుకు టవల్ ను చుట్టడం మాత్రం అంత మంచిది కాదు. 

తలస్నానం తర్వాత జుట్టుకు టవల్ ను చుట్టడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. ఇలా టవల్ ను చుట్టడం వల్ల జుట్టు దారుణంగా ఊడిపోతుంది. అలాగే వెంట్రుకలు ఫాస్ట్ గా డ్రై గా మారుతాయి. తడి జుట్టుకు టవల్ ను చుట్టడం వల్ల ఎదురయ్యే సమస్యలేంటో తెలుసుకుందాం పదండి. 

hair fall

జుట్టు రాలిపోవచ్చు

స్నానం చేసిన వెంటనే జుట్టు ఆరాలని టవల్ ను చుట్టడం వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోయే ప్రమాదం ఉంది. ఎలా అంటే జుట్టుకు టవల్ ను చుట్టి మెలితిప్పి ముడి వేయడం వల్ల జుట్టు మొదల్లు వదులుగా మారుతాయి. వెంట్రుకల సిరలు కూడా బలహీనపడతాయి. అంతేకాదు వెంట్రుకల మెరుపు కూడా పోతుంది. 

జుట్టు పొడిబారుతుంది

స్నానం చేసిన తర్వాత జుట్టును పదే పదే టవల్ తో రుద్దడం అస్సలు మంచిది కాదు. ఇలా చేస్తే జుట్టు పొడిబారుతుంది. అందులోనూ టవల్ ను జుట్టుకు చుట్టడం వల్ల జుట్టులోని నేచురల్ ఆయిల్ ఉండదు. దీంతో మీ జుట్టు పొడిబారుతుంది. దీంతో మీ జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. 

ఆ టవల్ తో ముఖాన్ని తుడుచుకోకూడదు

తడి జుట్టుకు టవల్ ను చుట్టడం వల్ల జుట్టు దెబ్బతినడమే కాకుండా.. దానితో ముఖాన్ని తుడుచుకోవడం వల్ల ముఖంపై ఉండే చర్మం కూడా  దెబ్బతింటుంది. అందుకే జుట్టును తుడవడానికి ఉపయోగించిన టవల్ ను ముఖం తుడుచుకోవడానికి ఉపయోగించకండి. 
 

click me!