మెదడును ఆరోగ్యంగా ఉంచే బెస్ట్ ఫుడ్స్

Published : Sep 09, 2022, 11:35 AM IST

మెదడు సక్రమంగా పనిచేసినప్పుడే మనం అన్ని విధాలా హెల్తీగా.. సక్రమంగా పనిచేయగలుగుతాం. అయితే కొన్ని రకాల ఆహారాలు మెదడు మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.   

PREV
19
మెదడును ఆరోగ్యంగా ఉంచే బెస్ట్ ఫుడ్స్

మెదడును మరింత ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. వీటిలో కొవ్వు చేపలు ఉత్తమమైనవి. వీటిలో సార్డినెస్, సాల్మన్, ట్యూనా, ఉన్నాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ  ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు, నరాల కణాలను నిర్మించడంలో సహాయపడతాయి. అంతేకాదు ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. 
 

29

ఆకుపచ్చని కూరగాయలు

ఆకుపచ్చని కూరగాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి వివిధ శారీరక విధులను కూడా నియంత్రిస్తాయి. 

39

బ్రోకలీ

బ్రోకలీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరగాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. 

49

అవకాడోలు

అవకాడోల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. మెదడు పనితీరును మెరుగుపరిచే, ఆరోగ్యంగా ఉంచే ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఈ అవకాడో అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 

59

బ్లూబెర్రీస్

బ్లూ బెర్రీలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి. అంతేకాదు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. 
 

69

గుడ్లు

గుడ్లలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలుంటాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచి పనితీరును మెరుగుపర్చడానికి గుడ్లలో ఉండే  ప్రోటీన్లు,  B6, B12 ఎంతో సహాయపడతాయి. గుడ్లలో ఉండే ఫోలేట్, కోలిన్ లు ఎసిటైల్కోలిన్ ఉత్పత్తికి సహాయపడుతాయి.  ఇవి మన మానసిక స్థితి మెరుగుపర్చడంతో పాటుగా జ్ఞాపకశక్తిని నియంత్రణలో ఉంచుతాయి. 

79

గింజలు

గింజలు గుండెకు మేలు చేయడమే కాకుండా మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందుకోసం పిస్తా, బాదం పప్పులు, వాల్‌నట్ వంటి గింజలను రోజూ తినండి. ఇవి మీ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వాపును కూడా తగ్గించడానికి సహాయపడతాయి. 
 

89

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్ నుంచి మెదడును రక్షిస్తాయి. ఈ గింజల్లో మెదడును ఆరోగ్యంగా ఉంచే మెగ్నీషియం, ఇనుము, జింక్ లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

99

డార్క్ చాక్లెట్లు

డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాల్ కోకో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి మెదడుకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేస్తాయి. అందుకే ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా మోతాదులో డార్క్ చాక్లెట్లను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. 
 

 

Read more Photos on
click me!

Recommended Stories