శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఇలాంటి వాతావరణంలో చేస్తే అంతే సంగతులు!

Navya G   | Asianet News
Published : Feb 19, 2022, 01:52 PM IST

శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు (Breathing exercises) కలుషిత వాతావరణంలో చెయ్యకూడదు. అధికంగా వాయుకాలుష్యం ఉండే ప్రాంతాలలో శ్వాస వ్యాయామాలు చేస్తే అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) వచ్చే అవకాశం ఉంటుంది. శ్వాస వ్యాయామాలు ముఖ్యంగా ఎక్కడ చేయాలో సరైన అవగాహన కలిగి ఉండాలి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

PREV
17
శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఇలాంటి వాతావరణంలో చేస్తే అంతే సంగతులు!

వాయు కాలుష్యం (Air pollution) అధికంగా ఉండే ప్రాంతాలలో శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తే శ్వాస (Breathing) ద్వారా ఎక్కువ మొత్తంలో గాలి పీల్చుకున్నప్పుడు గాలి తోపాటు కాలుష్యం కూడా శరీరంలోకి వెళుతుంది.  కనుక వాయు కాలుష్యం ఉండే ప్రదేశంలో శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

27

అలాగే ఇంటి బయట కన్నా ఇంటిలోనే వాయు కాలుష్యం అధికంగా ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. వంట, పరిసరాల శుభ్రత కోసం ఉపయోగించే రసాయనాలు, మరుగుదొడ్ల (Toilets) వినియోగము, బొద్దింకలకు వాడే పురుగు మందులు (Insecticides), పెంపుడు జంతువుల కారణంగా బయట కన్నా ఇంటిలోనే ఎక్కువ కాలుష్యం ఉంటుందని పరిశోధనలో తేలింది.

37

అయితే బయట గాలిలో కంటే దుమ్ము ఇంట్లో కొంచెం తక్కువగా ఉంటుంది. తలుపులు వేసుకుని ఒక గదిలో శ్వాస వ్యాయామం చేసే వ్యక్తి నిజానికి 2.5, మైక్రో మిలియన్ల సైజులోని అతి సూక్ష్మ కాలుష్య ప్రాణాలను పీల్చుకుంటాడట. ఇలా లోపలికి వెళ్ళినా కాలుష్యాన్ని ఊపిరితిత్తులు (Lungs) శుద్ధిచేసిన (Refined) కొంత కాలుష్యం మాత్రం ఊపిరితిత్తులలో ఉండిపోతుంది.

47

దీని కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు (Respiratory diseases), మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులు (Heart disease) వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. దీంతో మనిషి జీవిత కాలం తగ్గిపోతుంది. కనుక శ్వాస వ్యాయామాలు అధిక కాలుష్యం ఉన్న ప్రాంతాలలో చేయకపోవడమే మంచిది.

57

ఇళ్ల నుంచి తక్కువ ఎత్తులో గాలిలో కాలుష్యం కారకాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇంటిపై అంతస్తులో వ్యాయామం చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేసే సమయంలో ముక్కు (Nose) కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ముక్కు కాలుష్యాన్ని శుద్ధి చేసే సమయంలో అతి సన్నని ధూళికణాలు (Dust particles) ముక్కు రంధ్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

67

ముక్కు 10 మైక్రోమీటర్ల కంటే పెద్ద కణాలను మాత్రమే వడపోయగలదు. కనుక 2.5 మిల్లీ మీటర్ల కంటే సూక్ష్మమైన కణాలని (Microscopic particles) ముక్కు ఫిల్టర్ (Filter) కు చిక్కకుండా నేరుగా శరీరంలోకి వెళ్లిపోతాయి. కనుక శ్వాస సంబంధిత వ్యాయామాలు అధిక కలుషిత వాతావరణ ప్రాంతంలో చేయరాదు .

77

సరైన పరిశుభ్రత వాతావరణంలో శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి (Health) మంచిది. అప్పుడే వ్యాయామ ఫలితాన్ని (Result) శరీరానికి అందించినట్లు అవుతుంది.  ధూమపానాన్ని నిషేధించినట్లే అధిక కాలుష్యం ఉన్న వాతావరణంలో శ్వాస వ్యాయామాలు చేయడంపై కూడా ఆంక్షలు పెట్టడం మంచిది.

click me!

Recommended Stories